Begin typing your search above and press return to search.

కేటిఆర్ నకిలీ సెక్రెటర్లు అరెస్ట్ ...ఏంచేశారంటే ?

By:  Tupaki Desk   |   12 Dec 2019 7:58 AM GMT
కేటిఆర్ నకిలీ సెక్రెటర్లు అరెస్ట్ ...ఏంచేశారంటే ?
X
ప్రస్తుత రోజుల్లో చాలామంది బాగా డబ్బు సంపాదించాలని , మంచిగా సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారు. ఇది మంచిదే కానీ , అందులో కొంతమంది త్వరగా సెటిల్ అవ్వాలి అని , అడ్డదారులు తొక్కుతున్నారు. నకిలీ అధికారిగా మరి సులువుగా డబ్బు ని సంపాదించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆలా అధికారులుగా చెలామణి అవుతున్న ఇద్దరు నకిలీ అధికారులని పోలీసులు అరెస్ట్ చేసారు. వీరిద్దరూ ఏకంగా..ఎదో సాదాసీదా అధికారులం అని చెప్పుకోలేదు. కొడితే ఏకంగా కొండనే ఢీ కొట్టాలని అన్నట్టు .. ఈ ఇద్దరు కూడా మంత్రి కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శులుగా మారి ..సెటిల్మెంట్స్ చేయడం మొదలుపెట్టారు. తాజాగా వీరి బండారం బయటపడటం తో రాచకొండ పోలీసులు అరెస్ట్ చేసారు.

పూర్తి వివరాలు చూస్తే.. మల్కాజ్‌గిరిలోని గీతానగర్‌కు చెందిన రూపాకుల కార్తికేయ సీఏ చదివాడు. తార్నాకకు చెందిన స్నేహితుడు ఫ్రెడరిక్‌తో కలిసి ప్రైవేట్ కంపెనీలకు కన్సల్టెన్సీ వ్యవహరించేవాడు. వీరిద్దరూ ఆయా కంపెనీల పనిమీద రోజూ ప్రభుత్వాధికారులను కలుస్తూ అక్కడ జరిగే ప్రక్రియలను బాగా అర్థం చేసుకున్నారు.

ఈ నేపథ్యంలోనే సులువుగా డబ్బు సంపాదించుకునేందుకు మంత్రి కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శి పేరుతో కార్తికేయ సెక్రటరీ అవతారమెత్తాడు. మారేడ్‌పల్లిలోని కస్తూర్బాగాంధీ మహిళా కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీరాములరాజును పరిచయం చేసుకుని తన ఫ్రెండ్ కుమార్తెకు అందులో సీటు ఇప్పించాడు. ఇందుకోస స్నేహితుడి దగ్గర రూ.90వేలు తీసుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత కార్తికేయకు ఫోన్ చేసిన శ్రీరాముల రాజు తన కుమారుడిని అనారోగ్యంతో ఆస్పత్రిలో చేర్పించామని, ప్రభుత్వం నుంచి వైద్య ఖర్చులు ఇప్పించాలని కోరాడు.

దీనితో కార్తికేయ సీఎం పేషీ నుంచి తెచ్చినట్లు రూ.2లక్షల వైద్య ఖర్చుల ట్రీట్‌మెంట్ లెటర్‌ను శ్రీరాముల రాజుకు ఇచ్చి కొంత కమిషన్ తీసుకున్నాడు. రాజు ఆ లెటర్‌ను శ్రీకర్ ఆస్పత్రిలో ఇవ్వగా అది నకిలీదని తేలింది. దీంతో బాధితుడు ఈ నెల 6వ తేదీ ఘట్‌కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు కార్తికేయ, అతడి ఫ్రెండ్ ఫ్రెడరిక్‌ను అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు