Begin typing your search above and press return to search.
అందరిని వెనక్కి పంపేసిన కేసీఆర్
By: Tupaki Desk | 8 May 2019 4:02 AM GMTకేసీఆర్ కేరళ ట్రిప్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దేవాలయాల్ని సందర్శించటంతో పాటు.. తాను షురూ చేసిన ఫెడరల్ ఫ్రంట్ వాదాన్ని వినిపించేందుకు వేదికగా చేసుకున్న వైనం తెలిసిందే. తనతో పాటు.. పార్టీ నేతలు పలువురిని వెంటబెట్టుకెళ్లిన కేసీఆర్.. మంగళవారం సాయంత్రానికి పలువురు నేతల్ని వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ అయినట్లు చెబుతున్నారు.
కేరళలో కుటుంబ సభ్యులతో పాటు.. పార్టీ నేతలతో కలిసి వచ్చిన కేసీఆర్.. ఇప్పుడు మాత్రం అందరిని వెళ్లిపోవాలని కోరినట్లు చెబుతున్నారు. మనమళ్లు.. మనమరాళ్లతో పాటు.. సతీమణితో కలిసి కేరళ ట్రిప్పునకు వచ్చిన కేసీఆర్ బృందానికి.. ఇప్పుడు టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. కుమారుడు కేటీఆర్.. కోడలు కలిశారు. మంగళవారం వారిద్దరూ కేరళ చేరుకున్నారు.
కేరళకు తన వెంట వచ్చిన వారందరిని వెనక్కి పంపేసిన కేసీఆర్.. ఇప్పుడు కేవలం తన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే కేరళలో ఉన్నారు. ఈ తీరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జాలీడే కోసమే కేరళ ట్రిప్పా అన్నది ఒక ప్రశ్న అయితే.. ఒకవైపు రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఆత్మహత్య చేసుకోవటం.. దీనిపై వెల్లువెత్తుతున్న నిరసనలు ఒక కొలిక్కి రాక ముందే.. ట్రిప్ కోసం కేరళకు వెళ్లిన వైనాన్ని పలువురు తప్పు పడుతున్నారు.