Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ కంచుకోట.. కేటీఆర్ ను భయపెడుతోంది..
By: Tupaki Desk | 28 May 2019 6:11 AM GMTబావ హరీష్ రావుతో సై అన్నాడు.. మెదక్ పార్లమెంట్ లో కంటే.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ లో ఒక్క ఓటైనా ఎక్కువ తెచ్చుకుంటానని మొన్నటి పార్లమెంట్ ఎన్నికల వేళ కేటీఆర్ తొడ కొట్టాడు. కానీ ట్రెయిన్ రివర్స్ అయ్యింది. టీఆర్ఎస్ కు కంచుకోటైన కరీంనగర్ లో టీఆర్ఎస్ ఓడిపోయింది.. బీజేపీ గెలిచింది. కేటీఆర్ ప్రతిష్ట మసకబారింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బరిలోకి దిగిన తొలి పోరే కేటీఆర్ కు పీడకలను మిగిల్చింది. ఇక హరీష్ రావు మాత్రం యథాలాపంగా గెలుపు బావుటా ఎగురవేయించాడు. మెదక్ లో టీఆర్ఎస్ ను గెలిపించాడు.
కేటీఆర్ నాయకత్వానికి పరీక్ష పెట్టిన పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సీట్లు తగ్గడంతో కేసీఆర్ హతాషుడయ్యాడన్న వార్త బయటకు వచ్చింది. ఆ వేడి తగ్గకముందే ఇప్పుడు మరో ఎన్నిక. నల్గొండ ఎంపీగా గెలిచిన ఉత్తమ్ పోటీచేసిన హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉత్తమ్ కు కంచుకోటైన హుజూర్ నగర్ లో ఆయన స్థానంలో భార్య పద్మావతిని కాంగ్రెస్ నిలబెడుతోంది. మొన్నటి ఎన్నికల వేళ టీఆర్ఎస్ హవా నడిచినా ఉత్తమ్ తట్టుకొని టీఆర్ఎస్ అభ్యర్థి సైదారెడ్డిపై 14వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. లోక్ సభ ఎన్నికల్లో అంతకుమించి ఓట్లు దక్కించుకొని ఎంపీగా గెలిచారు.
మరి టీఆర్ఎస్ కు సవాల్ విసురుతున్న హూజూర్ నగర్ లో టీఆర్ఎస్ గెలవడం ఇజ్జత్ కా సవాల్ గా మారింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఓడి.. ఇప్పుడు హూజూర్ నగర్ లో కూడా ఓడితే టీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికల నాటికి ఘంటలు మొగినట్టేనని .. కాంగ్రెస్ మరింత దూకుడు పెంచడం ఖాయంగా మారుతుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు..
అందుకే ఈ ఎన్నికపై ప్రధానంగా ఫోకస్ పెట్టిన కేసీఆర్ హుజూర్ నగర్ లో పోటచేసేందుకు మొదట కవిత పేరును ఆలోచించాడు. ఆ తర్వాత ఓడిన సైదారెడ్డికే సానుభూతి కలిసి వస్తుందని అనుకున్నారు. ఇప్పుడు బడా నేత గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును కేసీఆర్ ప్రతిపాదిస్తున్నారు.
హూజూర్ నగర్ బాధ్యతను కూడా కేటీఆర్ చేతిలోనే పెడుతున్నారట.. అందుకే కొన్ని ముందస్తుగా అభివృద్ధి పనులకు కేటీఆర్ అక్కడ ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. కరీంనగర్ లోనే గెలిపించలేకపోయిన కేటీఆర్ కాంగ్రెస్ కు కంచుకోటైన హుజూర్ నగర్ లో ఎంతమేరకు ప్రయత్నిస్తాడు.? ఇది కూడా ఓడితే కేటీఆర్ ప్రతిష్ట ఏమవుతుంది.. టీఆర్ ఎస్ కు ఇజ్జత్ కా సవాల్ గా మారిన ఈ హూజూర్ నగర్ లో టీఆర్ ఎస్ గెలుస్తుందా అనే టెన్షన్ వెంటాడుతోంది. బహుషా కేటీఆర్ కంటే ట్రబుల్ షూటర్ హరీష్ ను దించితే బెటర్ ఏమోనన్న టాక్ పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. మరి కేసీఆర్ ఏం డిసైడ్ చేస్తాడన్నది వేచిచూడాల్సిందే.