Begin typing your search above and press return to search.

కేంద్రంపై కేటీఆర్ ఫైర్.. నెటిజన్ల కౌంటర్ల వార్

By:  Tupaki Desk   |   2 Aug 2022 10:08 AM GMT
కేంద్రంపై కేటీఆర్ ఫైర్.. నెటిజన్ల కౌంటర్ల వార్
X
చేనేత ఖాదీ వస్త్ర ఉత్పత్తులపై జీఎస్టీ విధించడమా? స్వదేశీ నినాదం అంటే అని ప్రధానమంత్రి నరేంద్రమోడీపై టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ మరోసారి సెటైర్లు వేశారు. అయితే కేటీఆర్ ట్వీట్ కు నెటిజన్ల నుంచి కూడా ఘాటు కౌంటర్లు పడ్డాయి. ఇటు కేటీఆర్ ట్వీట్.. అటు నెటిజన్ల కౌంటర్లతో సోషల్ మీడియాలో రచ్చరచ్చ అవుతోంది.

-మంత్రి కేటీఆర్ ఏమన్నారు? మంత్రి కేటీఆర్ తాజాగా చేనేత, ఖాదీపై జీఎస్టీ విధింపునకు నిరసనగా ట్వీట్ చేస్తూ 'నాడు మహాత్మాగాంధీ స్వదేశీ స్ఫూర్తిని ప్రజల్లో పెంపొందించడానికి ఆత్మనిర్భర్ చిహ్నంగా చరఖా ఉపయోగిస్తే.. ఇప్పుడు చేనేత, ఖాదీ వస్త్ర ఉత్పత్తులపై జీఎస్టీ విధించిన మొదటి ప్రధానిగా నిలిచారు.

ఇదేనా మీరు సాధించిన ఆత్మనిర్భర్ భారత్? కేంద్ర ప్రభుత్వం జాతికి తెలియజెప్పే స్వదేశీ నినాదం ఇదేనా?' అని కేటీఆర్ ప్రశ్నించారు. గత ఎనిమిదేళ్లలో చేనేత కార్మికుల కోసం కేంద్రం ఏం చేసిందో ఎందుకు చెప్పారని కేటీఆర్ ప్రశ్నించారు.

-బండి సంజయ్ నిస్సహాయ ఎంపీ: కేటీఆర్ ధ్వజం ఈనెల 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం కానుకగా ప్రకటించిన నేతన్న బీమా పథకంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. గత ఎనిమిదేళ్లలో చేనేత కార్మికుల కోసం కేంద్రం ఏం చేసిందో ఎందుకు చెప్పరని ఆయన ప్రశ్నించారు.

ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కరీంనగర్ జిల్లా అభివృద్ధికి ఏం చేశారని నిలదీశారు. కనీసం తన సొంత నియోజకవర్గ పరిధిలోని సిరిసిల్లలో మెగా పవర్ లూం క్లస్టర్ కూడా మంజూరు చేయించలేని ఓ నిస్సహాయ ఎంపీగా బండి సంజయ్ ను కేటీఆర్ అభివర్ణించారు.

-కేటీఆర్ కు నెటిజన్ల కౌంటర్ ఇక కేటీఆర్ ట్వీట్ కు నెటిజన్లు కౌంటర్లతో విరుచుకుపడుతున్నారు. 'చేనేత ఖాదీ ఉత్పత్తులపై జీఎస్టీ విధింపుల్లో రాష్ట్రాల మద్దతు లేనిదే సాధ్యం కాదు' అంటూ కేటీఆర్ పై మండిపడుతున్నారు. మీరూ డబుల్ గేమ్ ఆడవద్దని.. రాష్ట్రాల పన్నుల మాట ఏమిటంటూ వివిధ రంగాలపై టీఆర్ఎస్ వేసిన పన్నులను కొందరు ఎత్తి చూపారు.

మొత్తంగా అటు కేటీఆర్.. ఇటు ఆయన ట్వీట్ పై కౌంటర్లతో ట్విట్టర్ దద్దరిల్లిపోయింది. ఈ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది.