Begin typing your search above and press return to search.
చీరల వివాదంలోకి కవిత...మండిపడిన కేటీఆర్
By: Tupaki Desk | 18 Sep 2017 1:19 PM GMTతెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మొదటి రోజునే వివాదాస్పదమైంది. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం పలు చోట్ల రసాభాసగా మారింది. కొన్ని చోట్ల చీరలు తగులబెట్టారు. ప్రభుత్వం తీరుపై విరుచుకుపడ్డారు. అయితే ఈ పరిణామంలోకి ఎంపీ కవితను లాగడం గమనార్హం.
బతుకమ్మ చీరల్లో నాసిరకం చీరలు ఎక్కువగా ఉన్నాయని ఆరోపిస్తూ వాటిని తగలబెట్టిన సందర్భంగా ఓ మహిళ మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ``ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఇలాంటి చీరలు కట్టుకుంటుందా? ఆమె కట్టుకుకునే ఒక్కో చీర 20 వేలు ఉంటుంది. వేసుకునే నగలు లక్షల్లో ఉంటాయి. అంత ఖరీదైన చీరలను కూడా గంటగంటకు మార్చుతుంది. ఇవన్నీ మేం టీవీలో చూస్తున్నాం. మాకు ఏమీ తెలియదు అనుకోవద్దు. ఎంపీ కవితకు అలాంటి చీరలు ఇచ్చి మాకు మాత్రం ఇవి ఇవ్వడం ఎందుకు? `` అంటూ నిప్పులు చెరిగింది. ఆ పెద్దావిడ కామెంట్లు కలకలం రేగాయి.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వం కానుక అంటూ సర్కార్ పంపిణీ చేస్తున్న చీరలు నాసిరకంగా ఉన్నాయని పలు జిల్లాలలో మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరు - పెనుబల్లి మండలాలలో చీరల నాణ్యత పట్ల నిరసన వ్యక్తం చేస్తూ మహిళలు వాటిని దగ్ధం చేసి బతుకమ్మ ఆడారు. అలాగే జగిత్యాల జిల్లాలో కూడా మహిళలు ప్రభుత్వం పంపిణీ చేసిన బతుకమ్మ చీరలను దగ్ధం చేశారు. నాణ్యమైన చేనేత చీరలు ఇవ్వాలనీ, వంద - రెండు వందల రూపాయలు విలువ చేసే నాసిరకం చీరలు తీసుకోవడం తమకు అవమానమని పేర్కొన్నారు. రూ.100 - 200విలువ చేసే నాసిరకం చీరలను అందించి అధికారులు - ప్రజాప్రతినిధులు చేతులు దులుపుకుంటున్నారని, తమకు చేనేత చీరలు కావాలని ఆందోళన చేపట్టారు. చౌరస్తాలో ప్రభుత్వం అందించిన నాసిరకం చీరలకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు. స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారిని అడ్డుకున్నారు.
ఇదిలాఉండగా...బతుకమ్మ చీరలపై కాంగ్రెస్ చిల్లర రాజకీయం చేస్తుందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. చీరల పంపిణిపై మహిళల ఆగ్రహంపై స్పందించిన కేటీఆర్.. సర్కార్ చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేకే కాంగ్రెస్ నీచ రాజకీయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగ పూట ఆడపడుచులకు ఆత్మీయంగా ఇస్తున్న కానుకపై అక్కసు వెల్లగక్కడం సరికాదన్నారు. ఈ విషయంలో కూడా విపక్షాలు ఇలా వ్యవహరిస్తాయని తాను ఊహించలేదని అన్నారు.