Begin typing your search above and press return to search.

రామ మందిరం క‌ట్ట‌లేదేం షా?:కేటీఆర్

By:  Tupaki Desk   |   11 Oct 2018 4:17 PM GMT
రామ మందిరం క‌ట్ట‌లేదేం షా?:కేటీఆర్
X
తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయ నేత‌ల ప‌ర్య‌ట‌న‌లు ఊపందుకున్నాయి. తెలంగాణ‌లో పాగా వేయాల‌ని చూస్తోన్న బీజేపీ...గ‌ట్టి ప్ర‌యత్నాలు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా కరీంనగర్ లో ప‌ర్య‌టించారు. అక్క‌డ జ‌రిగిన బ‌హిరంగ సభలో షా ...కేసీఆర్ స‌ర్కార్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఆ వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్ మండిప‌డ్డారు. నాలుగున్న‌రేళ్ల‌లో బీజేపీ పేద‌ల‌కు ఏమీ చేయలేదని - రాష్ట్రాల‌కు కేంద్రం ఇచ్చే నిధుల‌క‌న్నా కేంద్రం అద‌నంగా తెలంగాణ‌కు ఏమీ ఇవ్వ‌లేదన్నారు. మిషన్ కాకతీయ - మిషన్ భగీరథలకు నిధులు కేటాయింలేద‌న్నారు. ఏ మొహం పెట్టుకొని తెలంగాణ‌కు వ‌చ్చి కేసీఆర్ పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని షాపై మండిప‌డ్డారు. తమకు కనీసం మాట‌ మాత్రం చెప్ప‌కుండా కనీసం సంస్కారం లేకుండా 7 మండలాలను అప్రజాస్వామికంగా ఏపీలో కలిపిన పాపం బీజేపీ ప్రభుత్వానిద‌ని షా పై నిప్పులు చెరిగారు.

అయోధ్యలో రామాలయం కడతానని చెప్పి హిందువుల ఓట్లు వేయించుకొన్న బీజేపీ స‌ర్కార్...ఇప్పటి వరకు కట్టలేదని కేటీఆర్ విమ‌ర్శించారు. మతాల మధ్య చిచ్చు పెట్టి దేవుడైన రాముడిని కూడా మోసం చేశారని మండిప‌డ్డారు. బీజేపీ రామమందిరం కట్టలేదని - కానీ తెలంగాణ‌లో యాదాద్రి కడుతున్నామని, వేములవాడను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ సెక్యులర్ రాష్ట్రమని - పూజారులు - ఇమామ్‌ లు - పాస్టర్లకు గౌరవ వేతనం ఇస్తున్నామని అన్నారు. 119 స్థానాల్లో పోటీ చేస్తామని షా చెప్పారని - డిపాజిట్ లు ఎన్ని స్థానాల్లో ద‌క్కుతాయో చూద్దామ‌ని స‌వాల్ విసిరారు. తెలంగాణ ప్ర‌జ‌లు సెక్యులర్ భావాలు కలిగిన వార‌ని - మ‌త‌ప‌ర‌మైన వ్యాఖ్య‌ల‌తో రెచ్చ‌గొట్టినా...ఫ‌లితం లేద‌ని అన్నారు. రాబోయే ఎన్నికల్లో 5 సీట్లను బీజేపీ తిరిగి నిలబెట్టుకుంటే గొప్పని - షా మాటలు బంద్ చేసి తెలంగాణకు ఇచ్చిన ప్రతి హామీని అమ‌లు చేయాల‌న్నారు.