Begin typing your search above and press return to search.
బీజేపీని తిట్టాలంటే మాత్రం.. మరీ అంతలా నోరు జారితే ఎలా కేటీఆర్?
By: Tupaki Desk | 8 March 2021 5:30 AM GMTకొందరి నోట కొన్ని మాటలు అస్సలు రాకూడదు. ఆ మాటలు వారికి నప్పవు సరి కదా.. లేనిపోని తిప్పలు తెచ్చి పెట్టటమే కాదు.. చాట భారతంలా ప్రత్యర్థులు విరుచుకుపడేందుకు అవకాశాన్ని ఇచ్చినట్లు అవుతుంది. అయినా.. మాటలు చెప్పే వేళలో.. ఎప్పుడూ బ్యాలెన్సు తప్పని మంత్రి కేటీఆర్ లాంటి వారు సైతం.. ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చిన తీరు చూస్తే.. ఎమ్మెల్సీ ఎన్నికలు ఆయన్ను ఎంతటి ఒత్తిడికి గురి చేస్తున్నాయన్న భావన కలుగక మానదు.
తెలంగాణ రాష్ట్రంలో పోటాపోటీగా సాగుతున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ విపరీతంగా శ్రమిస్తున్నారు. తాజాగా ఆయన పాల్గొన్నకార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారటమే కాదు.. తెలంగాణ అధికారపక్షానికి కొత్త తిప్పలు తీసుకురావటం ఖాయమంటున్నారు.
తెలంగాణ ఉద్యమంలో మీరు ఎక్కడ ఉన్నారు? బీజేపీ తరఫున గెలిచిన నలుగురు ఎంపీలు ఏ రోజైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? సీఎంను పట్టుకొని బట్టేబాజ్ అనటానికి ఎన్ని గుండెలు? మేము మీకంటే ఎక్కువ మాట్లాడగలం. మంత్రులు హరీశ్.. ఈటలతో సహా మా నేతలు ఎక్కువగా తిట్టగలరు. అలా చేస్తే మీరు తట్టుకోలేరు. ప్రధాని మోడీ.. కేంద్రమంత్రి అమిత్ షా మీద మేం మాట్లాడలేమా? వయసుకు.. పదవులకు మర్యాద ఇస్తున్నట్లుగా గుర్తుంచుకోవాలని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
వయసు.. పదవులకు మర్యాద ఇవ్వటమే విషయమైతే.. గతంలో ప్రధాని మన్మోహన్ మొదలు.. సోనియా లాంటి వారిపైన పెద్ద ఎత్తున విమరశలు చేయటాన్ని ఏమనాలి? తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఎంపీలుగా గెలిచిన నలుగురు ఎక్కడ? అని ప్రశ్నించే కేటీఆర్.. అదే ఉద్యమంలో పాల్గొన్న వారికి ఈ రోజు తెలంగాణ మంత్రివర్గంలో ఎంతమందికి ప్రాధాన్యత ఇచ్చారు. పదవుల దాకా ఎందుకు..? ఎన్నికల బరిలో నిలబెట్టిన వారిలో ఎంతమంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఎవరిదాకానో ఎందుకు? మంత్రి తలసాని పెద్ద ఎగ్జాంఫుల్ కాదా? అలాంటోళ్లు ఎంతో మంది ఈ రోజున టీఆర్ఎస్ ప్రభుత్వంలో పదవులు పొందారు. ప్రత్యర్థులకు పెద్ద ఎత్తున అవకాశం ఇచ్చేలా కేటీఆర్ మాట్లాడటం ఏమిటి? ఈసారి ఎన్నికల వేళలో ఆయన ఎందుకింత టెన్షన్ కు గురవుతున్నారు? అన్నది ప్రశ్న. ఎప్పుడూ కూల్ గా ఉంటూ.. మంట పుట్టే మాటలతో ప్రత్యర్థులను ఇరిటేట్ చేసే కేటీఆర్.. తాజాగా మాత్రం తనకు తానే ఇరిటేట్ కావటం దేనికి నిదర్శనం?