Begin typing your search above and press return to search.
కేంద్రంపై కేటీఆర్ ఫైర్ చూశారా?
By: Tupaki Desk | 15 Jun 2017 4:28 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు - మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనలో ఇటు ప్రతిపక్షాలు - అటు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అభివృద్ధికి అడ్డుపడేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తుంటే తాము మాత్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నామని కేటీఆర్ తెలిపారు. అయినప్పటికీ తమపై విమర్శళు చేస్తున్నారని తెలిపారు. 60 ఏళ్ల పాటు కరంటు ఇవ్వని కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు కళ్ళ బొల్లి మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం చెప్పినట్లుగా ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కుంభకోణాల్లో దిట్ట అయిన కాంగ్రెస్ ఆకాశంలో - భూమిలో - బొగ్గులో అన్నింటిలో అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. స్కాంలు చేసిన కాంగ్రెస్ వలే మిగిలిన వాళ్ళు చేస్తారని ఆ పార్టీ నేతల భావన అని మండిపడ్డారు.
తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఓటమి తప్పకపోవడంతో దాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ తమపై విమర్శలకు పాల్పడుతోందని కేటీఆర్ అన్నారు. రైతుల మీద ముదిగొండలో కాల్పులు జరిపింది కాంగ్రెస్ కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. చింత చచ్చిన పులుపు చావని రీతిలో కాంగ్రెస్ వ్యవహరిస్తోందని అన్నారు. పాలేరు ఎన్నికలో ఘోర పరాభవంతో అమరావతి కి తట్ట బుట్ట సర్దుకుందని తెలిపారు. టీడీపీ-కాంగ్రెస్‌లు కండువాలు మార్చుకోవడం దారుణమని అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం వామపక్షాలు లేవు దోమ పక్షాలు లేవని...అంత గులాబీ మయమేనని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగాలని చూస్తే కేంద్ర ప్రభుత్వం కూడా మనకు సహకరించడం లేదని, రాష్ట్రంలోని విద్యుత్ ను ఏపీకి దోచిపెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నప్పటికీ ప్లాంట్ ఏర్పాటు విషయంలో కేంద్రం స్పందించడం లేదని తెలిపారు. విశాఖలో ముడి సరుకు లేకున్నా స్టీల్ కంపెనీ పెట్టలేదా అని సూటిగా ప్రశ్నించారు. ఐటీఐఆర్ విషయంలో హైదరాబాద్ కు కేంద్రం మొండి చెయ్యి చూపిస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడుబోగమని ధైర్యంతో చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి తెలిపారు. తెలంగాణలో సంక్షేమ పాలనపై తమ నాయకుడికి ఉన్న చిత్తశుద్ధి ఇదని తెలిపారు. కాంగ్రెస్ హాయంలో రూ.200 పెన్షన్ ఇచ్చేవారని కానీ టీఆర్ఎస్ హయంలో 40 లక్షల మందికి నెలకు రూ.1000 పెన్షన్ ఇస్తున్నామన్నారు. ఇలా ఏటా రూ.5000 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్న ప్రభుత్వం టీఆర్ ఎస్ పార్టీ మాత్రమేనని తెలిపారు. దేశంలో ఒంటరి మహిళల గురించి ఆలోచించిన మనసున్న మనిషి కేసీఆర్ అని తెలిపారు. ఎవ్వరు ధర్నాలు చేయకుండానే సన్న బియ్యం భోజనం పెట్టిస్తున్న ప్రభుత్వం గురించి విద్యార్థులు ఆలోచించాలని కోరారు. దేశంలో ఏ ఆడపిల్లకు దక్కని విదంగా పేదింటి వారికి కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల ద్వారా ప్రయోజనం కల్పిస్తున్నామని కేటీఆర్ అన్నారు. ఆశ కార్యకర్తలకు ఈ రోజు వరకు పట్టుకున్న జెండాల వల్ల లాభం జరుగలేదని, కేసీఆర్ వల్లనే వారికి ప్రయోజనం కలిగిందని తెలిపారు. తెలంగాణ ప్రజల పట్ల నిబద్ధత ఒక్క కేసీఆర్‌కే ఉందని తెలిపారు. ఖమ్మం పట్టణంలోనే రెండు వేల ఉద్యోగాలు ఐటీ ద్వారా ఇప్పిస్తామని కేటీఆర్ ప్రకటించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/