Begin typing your search above and press return to search.
రాహుల్-బాబు..ఒకరు వీణ..మరొకరు ఫిడెల్
By: Tupaki Desk | 6 Nov 2018 5:51 PM GMTముసలి నక్క కాంగ్రెస్ - గుంటనక్క చంద్రబాబు ఒక్కటయ్యారని వ్యాఖ్యానించడం ద్వారా తన మాట తీరులోని మరో కోణాన్ని చూపించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయుడు - రాష్ట్ర అపద్ధర్మ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ పై - టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై విమర్శల దాటిని కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ మరోమారు ఈ కలయికపై విరుచుకుపడ్డారు. తెలంగాణలో సంక్షేమ పథకాలు - అభివృద్ధిని చూసి ఓర్వ లేకే కేసీఆర్ ను గద్దె దించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాయా కూటమిలో ముఖ్యమంత్రి ఎవరో వారే కుర్చీల కోసం కొట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో 40 మంది ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడుతున్నారంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. సీట్లు రాహుల్ గాంధీ.. నోట్లు చంద్ర బాబు.. ఓట్లు మాత్రం తెలంగాణ ప్రజలు వేయాలా? అంటూ ప్రశ్నించారు.
ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ - టీడీపీ చీఫ్ చంద్రబాబు మీటింగ్ పైనా తనదైన శైలిలో మంత్రి కేటీఆర్ స్పందించారు. 'మొన్న ఢిల్లీలో భేటీ అయినప్పుడు రాహుల్.. చంద్రబాబు ఒకరు వీణ - ఒకరు ఫిడేలు ఇచ్చుకున్నారు. డిసెంబర్ 11 తర్వాత ఒకరు వీణ...మరొకరు ఫిడేలు వాయించుకోవాల్సిందే' అని ఎద్దేవా చేశారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ బతికున్నప్పుడు ఒకసారి.. చనిపోయిన తర్వాత ఇంకోసారి ఆయనకు చంద్రబాబు వెన్ను పోటు పొడిచారని తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే కాంగ్రెస్ నేతల కడుపు మండుతోందన్న కేటీఆర్.. టీఆర్ ఎస్ గెలిస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అని ప్రశ్నించారు. పొరపాటు న 'మాయాకుటమి' అధికారంలోకి వస్తే నెలకో ముఖ్యమంత్రి మారతారని కేటీఆర్ అన్నారు.