Begin typing your search above and press return to search.
ఇద్దరు ‘నాయుళ్ల’ని కలిపి తిట్టేశాడు
By: Tupaki Desk | 3 Oct 2015 7:36 AM GMTతన మానాన తాను బతికేస్తూ.. ఏపీ దాటి హైదరాబాద్ లోకి అడుగు పెట్టకుండా ఉంటున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పాటు.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడ్ని కూడా కేటీఆర్ వదిలిపెట్టలేదు.
ఢిల్లీలో ఒక నాయుడు.. గల్లీలో ఒక నాయుడు తెలంగాణ ప్రయోజనాల్ని దెబ్బ తీస్తున్నారంటూ మండిపడ్డారు. గెలంగాణ రాష్ట్రానికి తీవ్రంగా అన్యాయం చేస్తున్నారంటూ వాపోయిన కేటీఆర్.. మావోయిస్ట్ ఎజెండానే తమ ఎజెండాగా చెప్పుకోవటం విశేషం.
తుపాకీ మోపలేని తెలంగాణ రాష్ట్రాన్ని తమ సర్కారు కోరుకుంటుందని చెప్పిన కేటీఆర్.. వరంగల్ లో జరిగిన పాశవిక ఎన్ కౌంటర్ గురించి మాత్రం పెద్దగా వ్యాఖ్యలు చేయక పోవటం గమనార్హం. ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాల్ని తమ ప్రభుత్వం చేపట్టిందని చెప్పిన కేటీఆర్.. కేంద్రాన్ని.. చంద్రబాబు నాయుడ్ని మాత్రమే కాదు.. మావోలకు సైతం తన మాటలతో కౌంటర్ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. మరి.. వీటిపై ఆయా వర్గాల వారు ఎలా స్పందిస్తారో..?