Begin typing your search above and press return to search.
టైమ్స్ నౌ యాక్షన్ ప్లాన్ సమ్మిట్ లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 14 Feb 2020 5:00 AM GMTతెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి గా కేటీఆర్ పేరు ఇటీవల కాలంలో తరచూ వినిపిస్తూ ఉంటోంది. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టినంతనే.. కేటీఆర్ ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి తగ్గట్లే కీలక వేదికల మీద సీఎం కేసీఆర్ వెళ్లాల్సిన వాటికి కేటీఆర్ ను పంపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ సంస్థ యాక్షన్ ప్లాన్ సమ్మిట్ ను దేశ రాజధానిలో నిర్వహించింది. దీనికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంపై తమకున్న గుర్రను ఈ వేదికగా ఆయన వెల్లడించారు. దేశంలో జాతీయ పార్టీలేమీ లేవని.. అలా చలామణిలో ఉన్నవన్నీ పెద్దసైజు ప్రాంతీయ పార్టీలేనని తేల్చేశారు. దేశ నిర్మాణంలో రాష్ట్రాల పాత్ర అనే అంశం మీద మాట్లాడే సందర్భంగా కేంద్రం మీద తనకున్న గుర్రును తన మాటలతో చెప్పేశారని చెప్పాలి.
దేశ వ్యాప్తంగా ఉనికి.. యంత్రాంగం ఉన్న జాతీయ పార్టీలేమీ లేవని చెప్పిన ఆయన.. బీజేపీ.. కాంగ్రెస్ లు సైతం పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలేనని తేల్చేశారు. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య మాత్రమేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్న ఆయన.. బలమైన రాష్ట్రాలు ఉన్నప్పుడే బలమైన దేశం సాధ్యమవుతుందన్నారు. కేంద్ర విధి విధానాలు ఎలా ఉన్నా వాటి ఆచరణ మొత్తం రాష్ట్రాల్లోనే ఉందన్న ఆయన.. మేకిన్ ఇండియా లాంటి కార్యక్రమాల్లో రాష్ట్రాల అనుమతులు.. రాష్ట్ర ప్రభుత్వ శాఖల సహకారం లాంటి అంశాలు కీలకమన్న విషయాన్ని గుర్తు చేశారు.
కేంద్రం మీద తనకున్న కోపాన్ని కేటీఆర్ దాచి పెట్టుకోలేదు. నిధుల కోసం కటకటలాడిపోతున్న వేళ.. కేంద్రం నుంచి వచ్చే నిధుల వాటాను ఆశిస్తున్న తెలంగాణ మంత్రి.. అదే విషయాన్ని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. రాష్ట్రాలకు కేంద్రం తన సొంత నిధులు ఇస్తుందన్న ఆలోచన సరికాదని.. రాష్ట్రాలు కూడా కేంద్రానికి నిధులు సమకూరుస్తుందన్న విషయాన్ని మరవకూడదన్నారు.
తెలంగాణ నుంచి గడిచిన ఐదేళ్ల లో రూ.2.72 లక్షల కోట్లు కేంద్రానికి పన్నుల రూపంలో ఇస్తే తిరిగి తెలంగాణకు కేంద్రం రూ.1.12 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. తెలంగాణ లాంటి డెవలప్ అవుతున్న రాష్ట్రాలకు కేంద్రానికి చెల్లిస్తున్న పన్నులతో పోలిస్తే.. కేంద్రం ఆ రాష్ట్రాలకు ఇస్తున్న నిధులు తక్కువన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్.. బీజేపీలను తమ రాజకీయ శత్రువులుగా చూడమని.. ప్రత్యర్థులుగా చూస్తామని స్పష్టం చేశారు.