Begin typing your search above and press return to search.

కేటీఆర్ వ్యాఖ్య‌లు: ఏపీ పోలీసుల‌కు ఇక్క‌డేం ప‌ని?

By:  Tupaki Desk   |   4 March 2019 7:13 AM GMT
కేటీఆర్ వ్యాఖ్య‌లు: ఏపీ పోలీసుల‌కు ఇక్క‌డేం ప‌ని?
X
సాధార‌ణంగా పండ‌గ వేళ‌లో రాజ‌కీయ కార్య‌క‌లాపాలు పెద్ద‌గా ఉండ‌వు. ఒక‌వేళ ఉన్నా.. వాటిని వాయిదా వేసుకుంటూ ఉండ‌టం అల‌వాటు. అందునా రెండు తెలుగు రాష్ట్రాల్లో శివ‌రాత్రి వేడుక‌గా చేసుకోవ‌టం ఆన‌వాయితీ. ఇలాంటి వేళ‌.. పొలిటిక‌ల్ ప్రెస్ మీట్లు దాదాపుగా ఉండ‌వు. అందుకు భిన్నంగా టీఆర్ ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ ఈ రోజు మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు.

గ‌డిచిన రెండు రోజులుగా చోటు చేసుకున్నవేర్వేరు ప‌రిణామాలు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిని ఉద్దేశించి విప‌క్ష నేత చేసిన వ్యాఖ్య‌ల‌తో పాటు.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌ల‌తో పాటు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారిన ఐటీ గ్రిడ్స్ సంస్థ‌కు చెందిన వ్య‌వ‌హారం నేప‌థ్యంలో ప్రెస్ మీట్ ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్య‌ర్థుల‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేసిన కేటీఆర్‌.. ప‌నిలో ప‌నిగా ఏపీ పోలీసుల‌ను ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య ఒక‌టి చేశారు. ఏపీ పోలీసుల‌కు తెలంగాణ‌లో ఏం ప‌ని? అంటూ సూటిగా క్వ‌శ్చ‌న్ చేశారు. కొత్త చ‌ర్చ‌కు తెర తీశారు.

కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల్లోని ముఖ్యాంశాల్ని చూస్తే..

+ ఏపీ ప్రజలకు సంబంధించిన ఓటర్ల వివరాలను తస్కరిస్తోందని ఐటీ గ్రిడ్స్‌ సంస్థపై ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు విచారణ చేపడితే తప్పేంటి?

+ ఏ తప్పూ చేయకుంటే ఏపీ ప్రభుత్వానికి ఉలికిపాటు ఎందుకు?.. అసలు ఆంధ్రా పోలీసులకు హైదరాబాద్‌ లో ప‌నేంటి?

+ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రేగ కాంతారావు - ఆత్రం సక్కు గిరిజన సంక్షేమం కోసం తెరాసలో చేరుతున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. మ‌ర్చిపోకూడ‌దు. అవసరమైతే పదవులకు రాజీనామా చేస్తామన్నారు

+ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారో చెప్పాలని ఉత్తమ్ చేసిన విమర్శలను ఖండిస్తున్నా. ఉత్తమ్ నాయకత్వం పై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే విమర్శలు చేశారు.

+ .రాహుల్ - ప్రియాంక ల సమక్షం లో నిన్న యూపీ బీజేపీ ఎంపీ సావిత్రి భాయి పూలే చేరారు ..ఆమెను రాహుల్ గాంధీ ఎంతకు కొన్నారు ?

+ పార్టీ లు మారడం - విధానాలు సమీక్షించుకోవడం సహజమే ..ఇది కొత్త అన్నట్టు ఉత్తమ్ మాట్లాడుతున్నారు

+ ఎన్నికల సమయం లో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి - తదితరులు కాంగ్రెస్ లో చేరారు. .వారిని ఎంతకు కొన్నారు? రేవంత్ రెడ్డి ని ఎంతకు కొన్నారు ? గ‌తం లో మా పార్టీ ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారు ? అసలు కొనడం అనే మాట తప్పు. ఇది రాజకీయ వ్యవస్థ ను దిగజార్చడమే .

+ తమ మిత్ర పక్షం టీడీపీ ఏపీ లో 26 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నపుడు ఉత్తమ్ ఇలా ఎందుకు మాట్లాడ లేదు ? ఇలాంటి చవక బారు విమర్శలు మానాలి. ఎమ్మెల్సీలు ఐదింటిని కైవసం చేసుకుంటాo.

+ అడ్డం గా దొరికినపుడు చంద్రబాబు - లోకేష్ లు మిద్దె నెక్కి అరుస్తూంటారు. ఏపీ ఓటర్ల సమాచారాన్ని టీడీపీ చోరీ చేస్తుందని హైదరాబాద్ నివాసి పిర్యాదు చేస్తే తెలంగాణ ప్రభుత్వం స్పందించదా ? ఏపీ పోలీసు లకు తెలంగాణ లో ఏం పని?.ఐటీ చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. తప్పు చేయనప్పుడు చంద్రబాబు ఎందుకు భయపడాలి. ప్రజల్లో పరపతి కోల్పోయానని చంద్రబాబు భయపడి మాట్లాడుతున్నారు.

+ ఏపీ లో బాబు చేసిందేమి లేదు. చంద్రబాబు కు సిగ్గుండాలి .దొంగే దొంగ అరుస్తున్నట్ట ఉంది. విచారణ లో కడిగిన ముత్యాల్లా బయట పడండి. చంద్రబాబు 18 కేసుల్లో స్టే లు తెచ్చు కున్నారు .ఈ కేసు లోనూ స్టే తెచుకోమనండి. ఎందుకు భయం ? .నకిలీ పేస్ బుక్ ఐడి లు సృష్టించి టీఆర్ ఎస్‌ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు ..ఈ డ్రామాలను ప్రజలు నమ్మరు.