Begin typing your search above and press return to search.
ఈ లెక్కన కేసీఆర్ ను కేటీఆర్ కాపాడినట్లే
By: Tupaki Desk | 21 Sep 2017 9:34 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు - మంత్రి కేటీఆర్ తన తండ్రిని ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న సమయంలో ఊరట కల్పించారా? విపక్షాల విమర్శలు - స్వపక్షీయులు సైతం ఇరకాటంలో పడిపోతున్న సందర్భంలో టైంలో కేటీఆర్ ఎంట్రీతో గులాబీ దళపతి అయిన కేసీఆర్ రిలాక్స్ అయ్యారా? అంటే అవుననే అంటున్నాయి టీఆర్ ఎస్ వర్గాలు. చీరల పంపిణీ ఎపిసోడ్ లో కేటీఆర్ క్రియాశీల పాత్ర ఇటు ప్రభుత్వం అటు పార్టీ పరువును కాపాడిందని అంటున్నారు.
ప్రజల నుంచి డిమాండ్ రాకపోయినప్పటికీ...టీఆర్ ఎస్ పార్టీ అధినేత - తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనంత తానుగా బతుకమ్మ పండుగకు చీరలు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులోనూ ఇటు చేనేత కార్మికులకు ఉపాధి - అటు తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ కానుక అనే రెండు లక్ష్యాలతో కేసీఆర్ ఈ స్కీంకు శ్రీకారం చుట్టారు. ఉద్దేశం ఉదాత్తమైనదే అయినప్పటికీ....తగిన ప్రణాళికలో ఇటు ప్రభుత్వపరమైన వైఫల్యంతో పాటుగా అటు అధికారుల లోపం కూడా తోడయింది. దీంతో చీరల పంపిణీ రచ్చరచ్చగా మారిపోయింది. చీరలు తీసుకునేందుకు నో చెప్పిన వారు కొందరైతే...ఏకంగా వాటిని తగులబెట్టి నిరసన తెలిపారు వారి మరికొందరు. చేనేత చీరలు అంటూ గుజరాత్ చీరలను ఇచ్చారని - నాసిరకం చీరలను అంటగట్టారని మహిళలు ఆరోపించారు. విపక్షాలు సైతం తెలంగాణ సర్కారుపై విరుచుకుపడ్డాయి
ఇలాంటి కీలక సమయంలో మంత్రి కేటీఆర్ ఎంట్రీ ఇచ్చారు. తన సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో పర్యటనను హడావుడిగా ముగించుకొని వచ్చి హైదరాబాద్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటు పరిపాలన పరంగా కీలక ప్రసంగం చేస్తూనే అటు వ్యూహాత్మకంగా విపక్షాల తీరుపై విరుచుకుపడ్డారు. మొదటిసారి చేపట్టిన కార్యక్రమం - పైగా కోటిమందికి పైగా చీరల పంపిణీ కాబట్టి కొన్ని లోటుపాట్లు ఉంటాయని తెలిపిన మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు. పువ్వులను సైతం కిందపడేసేందుకు ఇష్టపడని ఆడపడుచులు చీరలు ఎలా కాల్చేస్తారని సెంటిమెంట్ ప్రశ్న సంధించారు. చీరలు దగ్దం చేసిన ఉదంతం రాష్ర్టవ్యాప్తంగా జరగలేదని పేర్కొంటూ కేవలం విపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో మాత్రమే జరిగిందని కేటీఆర్ లా పాయింట్ లాగారు. వచ్చే ఏడాది మరింత పకడ్బందీగా చీరల పంపిణీ చేపట్టనున్నట్లు ప్రకటించారు. మొత్తంగా పార్టీ, ప్రభుత్వం ఇరకాటంలో పడిన సమయంలో ఎంట్రీ ఇచ్చి ఏకకాలంలో ఇటు భరోసా కల్పించడం, అటు విమర్శలు చేసి విపక్షాలను డిఫెన్స్ పడేసి నాయకత్వ లక్షణాలను చాటుకున్నాడని టీఆర్ఎస్ నేతలు తమ భావి నాయకుడి గురించి విశ్లేషిస్తున్నాయి.