Begin typing your search above and press return to search.
ఆ పోలీస్ మీద కేటీఆర్ కు కోపం వచ్చింది
By: Tupaki Desk | 12 Sep 2016 5:14 PM GMTమంత్రి కేటీఆర్ కు కోపం వచ్చింది. మిగిలిన శాఖల సంగతి ఎలా ఉన్నా.. పోలీసుల విషయంలో తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రత్యేక శ్రద్ధ ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీస్ శాఖ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యలు అన్నీఇన్నీ కావు. పోలీసుల విషయంలో ఎంతో శ్రద్ధ ప్రదర్శించటమేకాదు.. ఫ్రెండ్లీ పోలీసింగ్ తో తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్న ఆకాంక్షను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు స్పష్టం చేశారు.
ఇందుకోసం పోలీసులు ఒత్తిడికి గురి కాకుండా ఎన్నో చర్యల్ని తీసుకున్నారు. అయినప్పటికీ తెలంగాణ పోలీసుల తీరుపై వస్తున్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. దీనిపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. రంగారెడ్డి జిల్లా మంచాలలో ముందస్తుగా అనుమతి లేకుండా టూవీలర్ ర్యాలీని నిర్వహించిన వారిపై పోలీసులు అడ్డుకున్నారు. దీంతో.. ర్యాలీ నిర్వాహకులకు.. పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఈ సందర్భంగా ఉద్రిక్తత కాస్త పెరగటం.. మంచాల సీఐ ర్యాలీలో పాల్గొన్న యువకుడిపై చేయి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాల్ని ట్విట్టర్ ద్వారా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారో వ్యక్తి. ట్విట్టర్ లో తన దృష్టికి వచ్చిన ఈ ఉదంతంపై మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ర్యాలీలో పాల్గొన్న యువకుడిపై సీఐ చేయి చేసుకున్న ఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కేసీఆర్.. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలతో స్నేహంగా వ్యవహరించాలన్న ప్రభుత్వ సిద్ధాంతానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న వైనంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి కోపానికి కారణమైన సదరు సీఐపై ఎలాంటి చర్యలు ఉంటాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది