Begin typing your search above and press return to search.
రేవంత్ పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు!
By: Tupaki Desk | 1 Nov 2017 6:03 PM GMTతెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. గడిచిన కొద్దిరోజులుగా టీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్ పై తనకున్న ఆగ్రహాన్ని మాటలతో తీర్చుకున్నారు మంత్రి కేటీఆర్.
రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు కొందరు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ మాట్లాడారు. రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్లిపోయాడు? అంటూ ప్రశ్నించిన కేటీఆర్.. అన్ని దర్వాజాలు మూసుకుపోయాయని.. టీఆర్ఎస్‌లోకి ఎంట్రీ లేదని.. టీడీపీ ఖతమైందని.. తెరిచి ఉన్న ఒకే ఒక్క దర్వాజా కాంగ్రెస్ అని.. అందుకే ఆ పార్టీలోకి వెళ్లాడన్నారు.
గతంలో సోనియాను దెయ్యమని.. రాహుల్ ను ముద్దపప్పు అంటూ వ్యాఖ్యలు చేసిన రేవంత్.. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ.. డైలాగ్స్ చెబుతూ తెగ బిల్డప్ ఇస్తున్నారన్నారు. తమకు కాంగ్రెస్ పార్టీ కొత్తకాదని.. వారి నాటకాలు కొత్త కాదంటూ విరుచుకుపడ్డారు. తెలుగుదేశాన్ని తాను అధికారంలోకి తీసుకొస్తానని.. తానే ముఖ్యమంత్రిని అవుతానని కొడంగల్ లో నాడు రేవంత్ చెప్పాడని.. మరిప్పుడు ఆ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడు.. లోకేశ్ నాయుడు.. రేవంత్ రెడ్డిలు గతంలో పెద్ద పెద్ద మాటలు చెప్పారని.. ఇప్పుడు పత్తా లేకుండా పోయారన్నారు. బాబు అమరావతికి వెళ్లిపోయాడని.. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిపోయాడని.. ఇద్దరూ పత్తా లేరని.. తెలుగుదేశంపార్టీని చాపలా చుట్టేసి ఎక్కడో పెట్టేశారంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచేందుకు కొడంగల్ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. మన నాయకుడి నాయకత్వాన్నికాపాడుకోవటానికి అంతా సిద్ధంగా ఉండాలంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన కేటీఆర్ కు ఫైర్ బ్రాండ్ రేవంత్ ఏ రీతిలో కౌంటర్ ఇస్తారో?