Begin typing your search above and press return to search.
కేటీఆర్ కౌంటర్ తో కాంగ్రెస్‌లో మార్పు వస్తుందా?
By: Tupaki Desk | 31 March 2018 4:13 AM GMTతెలంగాణలో అధికార ప్రధాన ప్రతిపక్షాలైన టీఆర్ ఎస్ - కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ...ఇప్పుడే అలాంటి పరస్పర విమర్శలు - ఎదురుదాడులను ఆయా పార్టీలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు - ఐటీ మంత్రి కేటీఆర్ ప్రతిపక్ష కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. అదే సమయంలో తమను తరచుగా టార్గెట్ చేసే కుటుంబ పాలన - కుటుంబ రాజకీయం అనే కామెంట్ కు కౌంటర్ ఇచ్చారు.
వనపర్తి జిల్లాలో పర్యటించిన కేటీఆర్ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో కుటుంబపాలన సాగించిన చరిత్రను మరిచి తెలంగాణలో కుటుంబపాలన అంటూ ఇక్కడి కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని కేటీఆర్ అన్నారు. మోతీలాల్ నెహ్రూ మొదలుకొని జవహర్ లాల్ నెహ్రూ - ఇందిరాగాంధీ - రాజీవ్ గాంధీ - సోనియాగాంధీ - నేడు రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ లో ఉన్న నేతలు ఎవరని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదలుకొని జైపాల్ రెడ్డి వరకు కాంగ్రెస్ లో కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించలేదా అని ఆయన ప్రశ్నించారు. కుటుంబపాలనకు పెద్దపీట వేసే కాంగ్రెస్ నాయకులకు అంతా అలానే కనిపిస్తుందని కేటీఆర్ ఎద్దేవాచేశారు. జాతీయ నాయకులను మొదలుకొని రాష్ట్రస్థాయి నాయకులవరకు కాంగ్రెస్ నేతలను మంత్రి కేటీఆర్ సూటిగా ఎదురుదాడి చేసిన నేపథ్యంలో కుటుంబ పాలన గురించి కాంగ్రెస్ నాయకుల కామెంట్లలో తేడా ఉంటుందో లేదో చూడాలి మరి.
తమ పాలన గురించి మంత్రి కేటీఆర్ వివరిస్తూ అన్ని రాష్ర్టాలకంటే తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ విజయవంతంగా అమలుచేస్తున్నారని చెప్పారు. బీసీల కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను చూసి ఓర్వలేక కాంగ్రెస్ నేతలు వారిపై కుటిల ప్రేమను చూపేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 50 ఏళ్లలో 20 గురుకులాలు ఏర్పాటుచేస్తే, మూడేండ్లలోనే 120 గురుకులాలు ఏర్పాటుచేసిన ఘనత టీఆర్ ఎస్ సర్కారుదని మంత్రి చెప్పారు. బస్సు యాత్రల పేరుతో రాష్ట్ర ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతున్నదని - దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ను ప్రజలు బొందపెట్టడం ఖాయమని చెప్పారు. 47 ఏళ్లపాటు దేశాన్ని - రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ కు వచ్చే రోజుల్లో తీర్థయాత్రలు చేపట్టే అవకాశాన్ని రాష్ట్ర ప్రజలు కల్పిస్తారని మంత్రి ఎద్దేవాచేశారు. ప్రాజెక్టులకు కొబ్బరికాయలు కొట్టామని చెప్పుకొనే కాంగ్రెస్ నాయకులు 1984లో భీమాకు నీటి కేటాయింపులు చేస్తే ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు - అధికారపక్షం అన్న తేడా లేకుండా సీఎం కేసీఆర్ అన్ని నియోజకవర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు.