Begin typing your search above and press return to search.

'కాంగ్రెస్ ఓ గ‌లీజ్ పార్టీ': కేటీఆర్‌

By:  Tupaki Desk   |   25 Jun 2018 5:14 PM GMT
కాంగ్రెస్ ఓ గ‌లీజ్ పార్టీ: కేటీఆర్‌
X
అధికార టీఆర్ ఎస్‌ పార్టీలో ముంద‌స్తు ఫీవ‌ర్ జోరుగా సాగుతోంది. ఆ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముంద‌స్తు ప్ర‌స్తావ‌న చేసిన నేప‌థ్యంలో పార్టీ నేత‌లంతా అదే జ‌పం చేస్తున్నారు. తాజాగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు మంత్రి కేటీఆర్ సైతం కేసీఆర్ సీట్ల లెక్క‌ను చెప్పారు. అయితే, టీఆర్ ఎస్ టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్ విష‌యంలో ట్విస్ట్ ఇచ్చారు. ఉప ఎన్నిక‌ల‌కు తాము సిద్ధ‌మ‌ని కాంగ్రెస్ ప్ర‌క‌టిస్తే...వారికంత సీన్ లేద‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ - రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వడ్డి మోహన్ రెడ్డి - రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గంప నాగేందర్ - పలువురు నాయకులు - రైస్ మిల్లర్స్ - కార్యకర్తలు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మంత్రులు కేటీఆర్ - జగదీశ్ రెడ్డి - ఎంపీ కవిత సమక్షంలో పెద్ద ఎత్తున టీఆర్ ఎస్ లో చేరారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100కు పైగా సీట్లు గెలుస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో బ్రహ్మాండంగా పాలన కొనసాగుతోందన్నారు. కమీషన్లు - కాంట్రాక్టులు - సంచులు మోయడం కాంగ్రెస్ కు అలవాటని మండిపడ్డారు. కాంగ్రెస్ చరిత్ర కుంభకోణాల మయమని విమర్శించారు. కాంగ్రెస్ లాంటి గలీజ్ పార్టీ దేశంలో మరొకటి ఉండదని మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వాళ్ల సంగతి తెలిసే గాంధీజీ ఆ పార్టీని రద్దు చేయాలని ఆనాడే చెప్పారని గుర్తుచేశారు. నెహ్రూ నుంచి సోనియా వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. అవినీతి గురించి కాంగ్రెస్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని కేటీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్ కు 10 మంది ఎమ్మెల్యేలుంటే ఎవరికి వారు సీఎం అభ్యర్థులం అంటున్నారని - అదీ సీఎం అభ్య‌ర్థుల పార్టీ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వాళ్లు కుటుంబ పాలన గురించి మాట్లాడటం గొంగడిలో అన్నం తింటూ వెంట్రుకలు ఏరినట్టుందన్నారు.

సీఎం కేసీఆర్‌ గుండె ధైర్యమున్న నాయకుడు కాబట్టే కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని - తెలంగాణ ఏర్పాటుతో ఎక్కువ ప్రయోజనం పొందింది - ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంతో మొట్టమొదట లాభపడేది నిజామాబాద్‌ జిల్లానే అని ఎంపీ కవిత వ్యాఖ్యానించారు.