Begin typing your search above and press return to search.
బరాబర్ పొగరే అంటూ ఉత్తమ్ పై కేటీఆర్ ఫైర్!
By: Tupaki Desk | 28 Oct 2018 5:22 AM GMTమామూలుగా తెలంగాణ తాజా మాజీ మంత్రి కేటీఆర్ మాటలు పదునుగా ఉంటాయి. ఆయనకు కోపం వచ్చినా.. చిరాకు వచ్చినా ఆ మాటల్లో పదును మరింత పెరుగుతుంది. అలాంటిది.. ఎన్నికల వేళ అంతకంతకూపెరుగుతోన్న ఒత్తిడి వేళ.. టన్నుల టన్నుల చిరాకు మామూలే.
ఇలాంటి వేళ.. వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడేసే కేటీఆర్.. తాజాగా ఉత్తమ్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను చేసే వ్యాఖ్యల్ని తప్పు పట్టే వారిని.. తనకు పొగరుఉందని ఎదురుదాడి చేసే వారికి ఊహించిన రీతిలో సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశారు కేటీఆర్.
తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాజకీయాల మీద.. తన రాజకీయ ప్రత్యర్థుల మీద కసిదీరా అన్నట్లు తిట్టేసిన కేటీఆర్.. తన గురించి తాను కొత్త తరహాలో పరిచయం చేసుకోవటం గమనార్హం. నాకు బరాబర్ పొగరు ఉందన్న కేటీఆర్.. అంతలోనే తెలంగాణ సెంటిమెంట్ ను అసరాగా తెచ్చుకున్నారు.
తెలంగాణలో పుట్టి ఉప్పు.. కారం తినే ఏ బిడ్డలో అయినా సరే రోషం.. పొగరు ఉంటాయన్నారు. ఉత్తమ్ లా దద్దమ్మను కాదని.. పొగరున్నందుకే తాను తెలంగాణ కోసం పోరాటం చేసినట్లుగా చెప్పారు. ఉత్తమ్ తనను బచ్చా అంటున్నారని.. తన కంటే మూడేళ్లు పెద్దోడైన రాహుల్ గాంధీ బచ్చా కాదా? అని ప్రశ్నించారు.
తాను తెలంగాణ ఉద్యమంలో భాగంగా జైలుకు వెళ్లి వచ్చానని.. రాహుల్ ఏ రోజు అయినా ఉద్యమంలో భాగంగా జైలుకు వెళ్లి వచ్చారా? అని ప్రశ్నించారు. రాహుల్ మోచేతి నీళ్లు తాగితే రాని తెలివి.. రోషం.. తానుతిడితే వస్తోందా? అని ఫైర్ అయ్యారు.
ఉత్తమ్ తనకు తెలివి లేదంటున్నారని.. నిజమేతనకు తెలివి లేదని.. తాను ఉత్తమ్ మాదిరి కారు ఇంజన్లో రూ.3కోట్లు తగలబెట్టుకునే తెలివి లేదన్నారు. దొంగలా బ్యాగులో రూ.50 లక్షలు తీసుకెళ్లి ఎమ్మెల్యేలను కొనే తెలివి లేదన్నారు. ఎన్నికల ప్రచారం పెద్దగా జోరు అందుకోని ఇప్పుడే మాటల తీవ్రత ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో మరెంతగా ముదురుతుందో?