Begin typing your search above and press return to search.
షర్మిలపై మొదటిసారి స్పందించిన కేటీఆర్
By: Tupaki Desk | 19 Sep 2021 5:32 AM GMTవైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇటు సీఎం కేసీఆర్ ను.. అటు టీఆర్ఎస్ మంత్రులను తిట్టిపోస్తున్నా.. విధానాలను ఎండగడుతున్నా ఇప్పటిదాకా గులాబీ దండు పెద్దగా స్పందించింది లేదు. అయితే తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నేరుగా స్పందించాడు. ఉతికి ఆరేశాడు. ఆమె తీరును ఎండగట్టారు.
షర్మిలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమెను నిలదీశారు. షర్మిల, బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ లు జాతీయ పార్టీలకు తొత్తులు అని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పై తప్ప బీజేపీ, కాంగ్రెస్ గురించి షర్మిల ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. సీఎంను నోటికొచ్చినట్లు తిడితే రాజద్రోహం కేసులు పెట్టడానికి కూడా వెనుకాడమని వీరిద్దరికి కేటీఆర్ హెచ్చరించారు.
టీఆర్ఎస్ ఓట్లు చీల్చి జాతీయ పార్టీలకు న్యాం చేయాలని చూస్తున్నారని.. బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉండే రాష్ట్రాల్లో దమ్ముంటే బీసీ బంధు పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపించడం కోసమంటూ వైఎస్ షర్మిల తన తండ్రి పేరుతో ప్రాంతీయ పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి తెలంగాణలో అధికార టీఆర్ఎస్ నే టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ పై షర్మిల నిప్పులు చెరుగుతున్నారు. ఇక 'కేటీఆర్ ఎవరో తెలియదు'? అన్న ఆమె మాట విమర్శలపాలైంది.
ఇంత జరుగుతున్నా ఇప్పటిదాకా షర్మిలపై టీఆర్ఎస్ నేతలు ఎవరూ కౌంటర్లు ఇవ్వలేదు. తాజాగా మంత్రి కేటీఆర్ నేరుగా ఆమెను టార్గెట్ చేయడం ద్వారా ఇక షర్మిలను ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని అర్థమవుతోంది.