Begin typing your search above and press return to search.
కేటీఆర్ ఫస్టు బెంచ్... లోకేశ్ లాస్టు బెంచ్
By: Tupaki Desk | 3 Feb 2016 7:43 AM GMTగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు టీఆరెస్ - టీడీపీ యువనేతల సత్తాకు పరీక్షగా నిలిచాయి. ఈ ఎన్నికల్లో ఎవరి ప్రభావం ఎంత ఉంటుందన్న అంచనాలు, చర్చలు జరిగాయి. అయితే తాజా సర్వేలు యువనేతల సత్తాను వెల్లడించాయి. దీంతో ఇద్దరి మధ్య తేడా ఎంతో స్పష్టమైంది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో టీడీపీ తరపున ప్రచారం చేసిన నారా లోకేష్ - టీఆరెస్ తరఫున ప్రచారం చేసిన కేటీఆర్ ల్లో ఎవరు ఎక్కువగా ప్రజలను ప్రభావితం చేశారన్నది ఓ సర్వే వెల్లడించింది. ఎన్నికల నేపథ్యంలో సర్వే నిర్వహించిన వీడీపీ అసోసియేట్సు ఈ ఫలితాలను వెల్లడించింది. ఎన్నికల్లో ఓటర్లకు అత్యధికంగా ప్రభావితం చేసిన నేతలు ఎవరన్న దానిపై పీడీపీ సంస్థ ఈ సర్వే నిర్వహించింది. ఇందులో కేటీఆర్ - లోకేశ్ ల ప్రభావమే కాకుండా ఇతర నేతల ప్రభావాన్నీ అంచనా వేసింది. దాని ప్రకారం అత్యంత ప్రభావశీల నాయకుడిగా మంత్రి కేటీఆర్ నిలిచారని సర్వే వెల్లడించింది. 29 శాతం మందిని టీఆర్ ఎస్ కు ఓటేసేలా కేటీఆర్ ప్రభావితం చేసినట్టు తేల్చింది. 22 శాతంతో రెండో స్థానంలో అక్బరుద్దీన్ ఓవైసీ నిలిచారు. మూడో స్థానం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కింది. ఆయన 11 శాతంతో మూడో స్థానంలో నిలిచారు. టీడీపీ ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్న లోకేష్ కు మాత్రం ఊహించని షాకే తగిలింది. కేవలం 3 శాతం మందిని మాత్రమే ఆయన ప్రభావితం చేయగలిగారని సర్వే చెబుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో రేవంత్ 2 శాతం, కిషన్ రెడ్డి 2 శాతంతో ఉన్నారు.