Begin typing your search above and press return to search.
ఈటల రాజీనామా చేసిన పోస్టుకు కేటీఆర్?
By: Tupaki Desk | 16 Jun 2021 3:30 PM GMTటీఆర్ఎస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఇటీవల బీజేపీలోకి చేరిన ఈటల రాజేందర్.. హైదరాబాద్ లోని మరో కీలక పదవి ఆయన చేతిలో ఉంది. బయట ప్రజలకు పెద్దగా పరిచయం లేని నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీకి ఆయన అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. చూసేందుకు చాలా చిన్న పోస్టుగా అనిపించినా.. చాలా పవర్ ఫుల్ పదవిగా చెప్పాలి. ఈ పదవి అందరికి ఉత్తనే రాదు. దానికి చాలానే కత ఉంటుందని చెబుతారు.
అలాంటి పదవికి ఈటల రాజీనామా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ పదవికి విపరీతమైన పోటీ ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఈ సొసైటీకి అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ కొనసాగుతున్నారు. భారీ ఎత్తున నిధులు ఉన్న ఈ సొసైటీకి అధ్యక్షుడిగా ఎంపిక కావటం అందరికి సాధ్యమయ్యే పని కాదు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ పదవిని మంత్రి కేటీఆర్ కు అప్పగించాలన్న యోచనలోసొసైటీ ఉన్నట్లు తెలుస్తోంది. సొసైటీకి తన రాజీనామా పత్రాన్ని పంపగా.. ఆ వెంటనే సొసైటీ పాలకమండలి సభ్యులు సమావేశమై తమ ఆమోదాన్ని తెలిపింది. దీంతో.. తదుపరి అధ్యక్షుడ్ని ఎంపిక చేయటానికి మార్గం సుగమమైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రి కేటీఆర్ కు మించినోళ్లు లేని కారణంగా.. ఆయన్నే సొసైటీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కోరనున్నారు. మరి.. దీనికి కేటీఆర్ ఓకే అంటారా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.