Begin typing your search above and press return to search.

కామెడీగా మారిన కేటీఆర్ క‌న్ఫ్యూజ‌న్‌

By:  Tupaki Desk   |   18 Dec 2017 6:21 AM GMT
కామెడీగా మారిన కేటీఆర్ క‌న్ఫ్యూజ‌న్‌
X
ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో చిన్న పొర‌పాటు కూడా భారీఇమేజ్ లాస్‌కు కార‌ణ‌మ‌వుతుంటుంది. సోష‌ల్ మీడియా యాక్టివ్ గా ఉండ‌టం.. ఎవ‌రికి వారు త‌మ అభిప్రాయాల్ని స్ప‌ష్టంగా చెప్ప‌టంతో పాటు.. స‌రైన పంచ్ వేయాలే కానీ సామాన్యుడి మాట కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారుతున్న ప‌రిస్థితి.

ఇలాంటి వేళ‌.. ఆచితూచి అడుగులు వేయాల్సిన దానికి భిన్నంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన క‌న్ఫ్యూజ‌న్ ట్వీట్ ఆయ‌నపై జోకులు పేల్చేలా చేస్తోంది. స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో మ‌ల్టీ టాలెంట్ ఉన్న అది కొద్ది మంది నేత‌ల్లో కేటీఆర్ ఒక‌రిగా అంద‌రూ కీర్తిస్తున్న ప‌రిస్థితి.

ఆయన మాట‌లు.. అభిప్రాయాల్ని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌ని రీతిలో ఉంటున్నాయి. పాల‌నా ప‌ర‌మైన త‌ప్పుల్ని ప‌క్క‌న పెడితే.. మీడియాలోనూ.. సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ ఫ్యూచ‌ర్ లీడ‌ర్ గా త‌న ఇమేజ్ ను అంత‌కంత‌కూ పెంచుకుంటున్న కేటీఆర్‌.. తాజాగా ట్విట్ట‌ర్ లో చేసిన ట్వీట్ ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

గుజ‌రాత్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు సంబందించి టీవీల్లో వ‌స్తున్న న్యూస్ పై ఆయ‌న స్పందించారు. గుజ‌రాత్‌.. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ఫ‌లితాలు త‌న‌ను క‌న్ప్యూజ్ అయ్యేలా చేస్తున్నాయ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఏ ప్రాంతంలో ఎవ‌రు ముందంజ‌లో ఉన్నారో.. ఎవ‌రు వెనుకంజ‌లో ఉన్నారో త‌న‌కు అస్స‌లు అర్థం కావ‌టం లేద‌న్నారు.

అభిప్రాయాలు వేర్వేరుగా ఉన్నా నిజాలు.. నెంబ‌ర్లు ఎలా మార‌తాయంటూ కేటీఆర్ రియాక్ట్ కావ‌టం ఫ‌న్నీగా ఉంది. ఎందుకంటే.. రిజ‌ల్ట్ విడుద‌ల‌య్యే వేళ‌.. ఒక్కో మీడియా ఒక్కో అంశాన్ని ప్రాతిప‌దిక‌గా తీసుకుంటుంది. ఎవ‌రి స్టైల్ వారిదే. కొంద‌రు ఈసీ అధికారికంగా వెల్ల‌డించిన స‌మాచారాన్ని మాత్ర‌మే టెలికాస్ట్ చేస్తుంటారు. అలాంటి వారు మిగిలిన వారి కంటే వెనుకంజ‌లో ఉన్న‌ట్లు క‌నిపిస్తారు. కానీ.. అంతిమంగా చూస్తే.. వారి అంకెలే వాస్త‌వ అంకెలుగా మార‌తాయి. మ‌రికొందరు.. గాలి వీచే వైనానికి త‌గ్గ‌ట్లుగా అంకెల్ని మార్చేస్తుంటారు. ఇది దుర్మార్గ‌మే అయిన‌ప్ప‌టికీ.. మీడియాలో నెల‌కొన్న అనారోగ్య పోటీ పుణ్య‌మా అని అలాంటి ప‌రిస్థితి నెల‌కొంది.

ఇలాంటి విష‌యాల‌న్నీ మీడియాలోని వారికి.. కేటీఆర్ లాంటి అన్ని తెలిసిన నేత‌ల‌కు బాగా తెలిసిన విష‌యాలు. ఇన్ని తెలిసిన త‌ర్వాత కూడా అమాయ‌కంగా అమూల్ బేబీ మాదిరి గుజ‌రాత్ ఫ‌లితాలు క‌న్ఫ్యూజింగ్ గా ఉన్నాయంటూ పోస్ట్ పెట్ట‌టం చూస్తుంటే.. కేటీఆర్ మ‌న‌సులో కూడా ఏమైనా ఇప్ప‌టికే ఇన్ని సీట్లు వ‌స్తాయ‌ని ఫిక్స్ అయ్యారా ఏంట‌న్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు.

తాను అనుకున్న అంకెల‌కు ద‌గ్గ‌ర‌గా రాక‌పోవ‌టం.. ఒక్కో మీడియాలో ఒక్కో తీరులో అంకెలు క‌నిపించ‌టంతో గంద‌ర‌గోళ ప‌రిస్థితుల్లో ట్వీట్ చేశారా? అన్న డౌట్ రాక మాన‌దు. గంద‌ర‌గోళం ఉంటే.. గ‌మ్మున కాసేపు ఉంటే స‌రిపోతుంది. ఆ మాత్రం దానికే హ‌డావుడి ప‌డి ట్వీట్ చేస్తే.. అన‌వ‌స‌రంగా కామెడీ కావ‌టం ఖాయం. తాజాగా కేటీఆర్ చేసిన ట్వీట్ పై సోష‌ల్ మీడియాలో పేలిన జోకులే ఇందుకు నిద‌ర్శ‌నం. కేటీఆర్ ట్వీట్‌ కు స్పందించిన కొంద‌రు టీవీని స్విచాఫ్ చేయాలంటే.. మ‌రికొంద‌రు అన్నింటిని వ‌దిలేసి ఈసీ ఫ‌లితాల్ని ఫాలో కావాల‌న్నారు. ఎందుకు.. గంట‌.. రెండు గంట‌లు ఏదైనా ప‌నిలో బిజీగా ఉంటే స‌రిపోతుంది క‌దా? త‌మను తాము అధికుల‌మ‌ని.. ప్ర‌త్య‌ర్థులు అల్పుల‌ని ఫీల‌య్యే రాజ‌కీయ పార్టీకి త‌గులుతున్న ఎదురుదెబ్బ‌కు కేటీఆర్ ఉలిక్కిప‌డ‌టం.. గంద‌ర‌గోళ‌ప‌డ‌టం ఎందుకంటారు?