Begin typing your search above and press return to search.
సొంత పార్టీ నాయకులకు కేటీఆర్ ఝలక్.. భారీ జరిమానా
By: Tupaki Desk | 2 March 2020 7:45 AM GMTప్రస్తుతం తెలంగాణలోని మున్సిపాలిటీల్లో ఓ కార్యక్రమం కొనసాగుతోంది. దీన్ని టీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ శాఖకు సంబంధించిన కార్యక్రమం. అదే పట్టణ ప్రగతి కార్యక్రమం. పది రోజుల పాటు పట్టణాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటించి సమస్యల పరిష్కారించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ క్రమంలో తన శాఖకు చెందిన కార్యక్రమం కాబట్టి మంత్రి రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో పర్యటిస్తూ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఉరుకులు పెట్టిస్తున్నారు. ఈ కార్యక్రమంలోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులకు వరుస షాక్ లు ఇస్తున్నారు. ఇటీవల ఓ ఎమ్మెల్యే నిధులు విడుదల చేయాలని కోరగా.. లేదు.. నేను ఇవ్వను అని ప్రజల ముందు బహిరంగంగా ప్రకటించాడు. దీంతో ఆ ఎమ్మెల్యే ఏం చేయాలో తెలియక గడ్డం పట్టుకు మరి బతిమిలాడాడు. తాజాగా కేటీఆర్ సొంత పార్టీ నాయకులకు భారీ జరిమానాలు విధించేలా చేశారు.
పట్టణ ప్రగతి కార్యక్రమం లో భాగంగా ఖమ్మం జిల్లాలో ఆదివారం మంత్రి కేటీఆర్ పర్యటించాడు. చాలా రోజుల తర్వాత కేటీఆర్ తమ జిల్లాకు రావడంతో టీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలుకుతూ బ్యానర్లు, భారీ ఫ్లెక్సీలు కట్టారు. వీటి ఏర్పాటుకు చిన్న, బడా నాయకులు కూడా ఉత్సాహం చూపారు. దీంతో ఖమ్మం పట్టణమంతా గులాబీ బ్యానర్లు, ఫ్లెక్సీలతో నిండింది. వీటిని చూసిన కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా మునిసిపల్ కార్పొరేషన్ అనుమతి లేకుండా భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడాన్ని గుర్తించిన ఆయన సంబంధికులకు భారీ జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు.
దీంతో వాటిని ఏర్పాటు చేసిన 16వ వార్డు కార్పొరేటర్ కామార్తపు మురళి, ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లకు రూ. లక్ష చొప్పున ఇద్దరికి జరిమానా విధించారు. స్వాగతపు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని చెప్పినా కూడా తమ ఆదేశాలను బేఖాతరు చేసి ఏర్పాటుచేయడంతో ఈ జరిమానా విధిస్తున్నట్లు ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. ప్రజలకు లబ్ది చేకూరే పథకాలను ప్రవేశ పెట్టి, ప్రజాసేవ చేస్తూ జనాల గుండెల్లో చోటు సంపాదించిన వారే నిజమైన నాయకులని.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఆర్భాటాలు చేస్తే నాయకులు కాలేరని ఆయన హితవు పలికారు. భవిష్యత్తులో ఇలాంటి భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని.. వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే మంత్రి ని ప్రసన్నం చేసుకుందామంటే ఉల్టా తమపైనే ఆగ్రహం వ్యక్తం చేయడం పై ఆ నాయకులు ఖంగుతిన్నారు.