Begin typing your search above and press return to search.

హైదరాబాదీలకు కేటీఆర్ గుడ్ న్యూస్

By:  Tupaki Desk   |   19 Dec 2020 4:32 PM GMT
హైదరాబాదీలకు కేటీఆర్ గుడ్ న్యూస్
X
హైదరాబాద్ ప్రజలు షాకిచ్చినా కానీ మంత్రి కేటీఆర్ మాత్రం ఆడిన మాట తప్పలేదు. తెలంగాణలో అధికార టిఆర్ఎస్ కు ఇటీవల జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికలలో భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు భవిష్యత్తులో ఇలాంటి నష్టాలు నివారించడానికి దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు.

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కేటీఆర్ తాజాగా హైదరాబాదీలకు వరాలు కురిపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చారు. 2021 ప్రారంభం నుంచి తమ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 20,000 లీటర్ల వరకు ఉచిత తాగునీటి సరఫరాను అందిస్తుందని తాజాగా అధికారికంగా ప్రకటించారు..

హైదరాబాద్ జలమండలి ద్వారా గ్రేటర్ వాసులకు నూతన సంవత్సరంలో 20వేల లీటర్ల వరకు తాగునీటిని ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. శనివారం ఉచిత నీటిపై కావాల్సిన కార్యచరణపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నగరంలో 20వేల లీటర్ల వరకు ఉచితంగా నీటిని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జనవరిలో వినియోగదారులకు వచ్చే డిసెంబర్ నెల బిల్లులో 20వేల లీటర్ల వరకు ఛార్జ్ చేయొద్దని అధికారులకు సూచించారు.దీనికి సంబంధించిన విధివిధానాలు రెండ్రోజుల్లో సిద్ధం చేయాలని కేటీఆర్ జలమండలి అధికారులు ఆదేశించారు. కొత్త సంవత్సరంలో నగరవాసులకు కేటీఆర్ అదిరిపోయే గిప్ట్ ఇవ్వనుండటంపై గ్రేటర్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ రాజకీయాల్లో ఇప్పుడు బిజెపి బలమైన శక్తిగా అవతరించింది. , ఏ పార్టీకి మేయర్ పదవిని దక్కించుకునేంత మెజారిటీ లభించ లేదు. ఇలాంటి క్లిష్ట రాజకీయ పరిస్థితులలో కెటిఆర్ తన పార్టీని జంట నగరాల ఓటర్లకు దగ్గరగా తీసుకెళ్లడానికి తాజాగా ఉచిత హామీల ప్రకటన చేశారు. తన సమయాన్ని, శక్తిని గ్రేటర్ పై కేంద్రీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే 20 వేల లీటర్లను నగరవాసులకు ఉచితంగా అందిస్తున్నారు.