Begin typing your search above and press return to search.

కేటీఆర్ హాట్ కామెంట్స్: ఆంధ్రజ్యోతి ఇబ్బంది పెట్టింది

By:  Tupaki Desk   |   13 Jan 2020 10:53 AM GMT
కేటీఆర్ హాట్ కామెంట్స్: ఆంధ్రజ్యోతి ఇబ్బంది పెట్టింది
X
రాజకీయాల్లోకి వచ్చాక రాళ్లు పడుతుంటాయ.. పూలు పడుతుంటాయి.. పలు సార్లు కుట్ర కూడా జరుగుతుంటుంది. ప్రత్యర్థి ఎదురైనా గట్టి పిండమైన తొణకకుండా ఎదురించగల నేర్పు ధైర్యం రాజకీయ నాయకుడి కి ఉండాలంటారు. ఇప్పుడు తండ్రిని మరిపించేలా కేటీఆర్ కూడా తమ ప్రత్యర్థిగా భావిస్తున్న ఆంధ్రజ్యోతి పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే ఇరుకున పెట్టేలా ప్రశ్న వచ్చినప్పుడు కేటీఆర్ కౌంటర్ ఇచ్చి దిమ్మ దిరిగేలా సదురు పత్రిక జర్నలిస్టు కు సమాధానం ఇచ్చాడు. ఇప్పుడా వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

తెలంగాణ లో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను సుతిమెత్తగా తీక్షణంగా విమర్శించడం లో ఆంధ్రజ్యోతి పత్రిక ముందుంటుంది. అయితే రాజకీయం గానూ ఆంధ్రజ్యోతి పై కేసీఆర్, కేటీఆర్ పలుమార్లు అక్కసు వెళ్లగక్కారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల ఎన్నికల వేళ కేటీఆర్ ఇదే ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘సీఎంగా పట్టాభిషేకం’ ఎప్పుడూ అని కేటీఆర్ ను పత్రిక జర్నలిస్టు ప్రశ్నించాడు. దానికి కేటీఆర్ కూడా దిమ్మదిరిగేలా కౌంటర్ ఇచ్చాడు. ‘ఆంధ్రజ్యోతి పత్రికే నేను సీఎం కాబోతున్నానని రాసి ఇబ్బంది పెట్టింది. నాకైతే తెలియదు.. మీకే తెలియాలి.. ముహూర్తాలు, తేదీలు మీరే నిర్ణయించి ప్రచురిస్తారు.. సీఎం ఎప్పుడవుతానో కూడా మీరే చెబితే సరిపోతుంది’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. దీంతో సదురు జర్నలిస్టు కు మైండ్ బ్లాంక్ అయినంత పని అయిపోయిందట..

మరి మంత్రులంతా కేటీఆర్ సీఎం అంటున్నారా అని సదురు జర్నలిస్టు ఉత్సాహం ఆపుకోలేక కేటీఆర్ ను అడిగేశాడు. దానికి గట్టిగా కౌంటరిచ్చారు. మంత్రులను మీలాంటి చురుకైన జర్నలిస్టులు అడిగినప్పుడే స్పందించారు. ఎవరూ పార్టీ పరంగా చెప్పలేదు. వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి అది సందర్భంగా కాదు అని దాటవేశారు.