Begin typing your search above and press return to search.
అరెరే..కేటీఆర్ నోట ఎలాంటి మాటలో చూశారా?
By: Tupaki Desk | 25 Jan 2016 4:02 AM GMTమాటలు నేర్పిన చిలుక ఏమైనా మాట్లాడగలదన్న విషయాన్ని నిరూపిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కమ్ తెలంగాణ మంత్రి కేటీఆర్. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో.. సీమాంధ్రులకు చెందిన ఓటర్ల మనసుల్ని దోచుకోవటానికి టీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. మొన్నటివరకూ సెటిలర్లు అంటూ వేలెత్తి చూపించిన తెలంగాణ అధికారపక్ష నేతలు.. ఇప్పుడు అందుకు భిన్నంగా తాను కూడా సెటిలర్ నే అంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఇలా గ్రేటర్ పరిధిలోని సెటిలర్లను ఆకట్టుకునేందుకు ఆయన చాలానే కష్టపడతున్నారు.
తాజాగా కుకట్ పల్లిలో గ్రేటర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన కేటీఆర్ మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ చిన్న అవకాశం వచ్చినా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును నిలువునా కడిగిపారేసే కేటీఆర్ నోటి వెంట.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య అసలు ఎలాంటి పంచాయితీ లేదని తేల్చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేస్తున్నారు.
ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య పంచాయితీలు లేకుంటే.. ఆ విషయం మీద ప్రజల మధ్య అనవసర సంచాయితీలు ఎందుకంటూ తెలివిగా ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధిలో అందరం భాగస్వామ్యం కావాలంటున్న కేటీఆర్ మాటల్ని వింటే.. ఆయన గారి తెలివితేటలకు మురిసిపోవాల్సిందే. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు విషయలో రేవంత్ రెడ్డితో పాటు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధం ఉందంటూ ఆడియో ఫుటేజ్ లతో పాటు.. బాబుపై కేసు నమోదు లాంటి పరిణామాలు.. రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత తీవ్రరూపం దాల్చటం లాంటి పరిణామాల్ని కేటీఆర్ మర్చిపోవచ్చేమో కానీ.. ప్రజలు అంత త్వరగా మర్చిపోతారా?అయినా.. ఇద్దరు ముఖ్యమంత్రుల పంచాయితీలతో సాదాసీదా ప్రజలకు సంబంధం ఏమిటి? ఎన్నికల ప్రచారంలో పంచాయితీల ప్రస్తావన కేటీఆర్ ఎందుకు తీసుకొస్తున్నట్లు..?