Begin typing your search above and press return to search.

అదంతా ఎన్నికల వరకే కలిసి పనిచేద్దాం..బీజేపీపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   9 Jan 2021 11:01 AM GMT
అదంతా ఎన్నికల వరకే కలిసి పనిచేద్దాం..బీజేపీపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
X
తెలంగాణ లో తెరాస, బీజేపీ మధ్య పోరు తీవ్రస్థాయిలో కొనసాగుతుంది. ఢీ అంటే ఢీ అంటున్నాయి ఈ రెండు పార్టీలు. ఈ మధ్య జరిగిన బై పోల్ లో కానీ , జీహెచ్ ఎంసి ఎన్నికల్లో కానీ బీజేపీ, తెరాస మధ్య పోరు చాలా రసవత్తకరంగా సాగింది. బీజేపీ , తెరాస నేతలు ఒకరిపై ఒకరు తీవ్రమైన విమర్శలు చేసుకున్నారు. ఇప్పటికి ఇంకా ఆ వేడి తగ్గలేదు. ఈ సమయంలో బీజేపీకి ఈసారి మంత్రి కేటీఆర్ ఓ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో మాత్రమే పోటీ పడదామన్నారు. ఎవరి వాదనలు వారు గట్టిగా చెప్పుకుందామని ,ఎన్నికల తర్వాత అభివృద్ధి కోసం కలసి పనిచేద్దామని...హుందాగా రాజకీయాలు చేద్దామన్నారు కేటీఆర్‌.

ఈ రోజు జిహెచ్ ఎంసీ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేశారు తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ లను లబ్ధిదారులకు అందచేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... 18 వేల కోట్ల రూపాయలతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. 28 రాష్ట్రాలలో ఎక్కడ ఇలా ఇల్లు ఇవ్వడం లేదని.. విలువైన ఇళ్ళు ఇవాళ ప్రజల చేతికి అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లు ఎవరికీ కిరాయి ఇవ్వకుండని.. అమ్ముకోవద్దని కోరారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం విషయంలో కేంద్రం సహకారం అందించాలని మంత్రి కోరారు. కంటోన్మెంట్‌లోని డిఫెన్స్ భూముల్లో పట్టాలు ఇప్పించేలా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కృషి చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో ఎలా ఉన్న ఎన్నికల తర్వాత అభివృద్ధి కోసం అందరం కలిసి సమన్వయంతో పని చేయాలని కోరారు. రాజకీయాల్లో పోటీ ఉండాలి కానీ, కొట్లాటలు సరికాదు అని కేటీఆర్ ఈ సందర్భంగా సూచించారు. కేటీఆర్ బీజేపీని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.