Begin typing your search above and press return to search.
ట్విట్టర్లో కేటీఆర్ రికార్డ్...రాష్ట్రపతితో ప్రత్యేక భేటీ
By: Tupaki Desk | 9 Feb 2018 5:19 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు - రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో రికార్డు సృష్టించారు. ట్విట్టర్ లో దూసుకెళ్తున్న కేసీఆర్ ఖాతాలో ప్రత్యేకత జోడయింది. ట్విట్టర్ లో కేటీఆర్ ఫాలోవర్స్ సంఖ్య 10 లక్షలు దాటింది. ఈ సందర్భంగా మినిస్టర్ కేటీఆర్ ట్వీట్ చేశారు. తనను ఫాలో అవుతున్న నెటిజన్లందరికీ మిలియన్ థ్యాంక్స్ చెప్పారు. రాష్ట్రంలో కానీ - దేశ - విదేశాల్లో ఎక్కడికి పోయినా తను చేస్తున్న ప్రతి పనిని ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా ప్రజలకు తెలియబరుస్తున్నారు. రాష్ర్టానికి వస్తున్న పెట్టుబడులు, అభివృద్ధి పనులను ట్విట్టర్ లో పోస్టు చేస్తూ.. ప్రభుత్వ పనితీరును తెలియజేస్తున్నారు. అంతేకాదు.. ట్విట్టర్ ద్వారా వస్తున్న ఫిర్యాదులపై తక్షణమే స్పందించి.. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఆ సమస్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ కు ట్విట్టర్ లో ఫాలోవర్స్ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. తనకు నచ్చిన సన్నివేశాన్ని పదిమందికి తెలియజేసేందుకు.. ట్విట్టర్ ను ఉపయోగించుకొని ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు కేటీఆర్.
ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ ఆపన్నులకు చేరువ అయిన అంశాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆపదలో ఉన్నవారు ఎవరైనా..ఎక్కడి నుంచైనా ఒక్క ట్వీట్ చేస్తే చాలు సమస్య పరిష్కారం అయిపోతుంది. ఒకవేళ తాను బిజీగా ఉంటే..ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేకంగా మంత్రి కేటీఆర్ ఆన్ లైన్ లోనే కేటీఆర్ ఆఫీస్ పేరుతో ఒక ట్విట్టర్ హ్యాండిల్ ను ఏర్పాటు చేశారు. సమస్యలను తక్షణమే చేరవేస్తూ వాటికి పరిష్కారం చూపుతున్నారు. ఇలా సహాయం పొందిన వారిలో కేవలం తెలంగాణ వారే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాల వారు కూడా ఉండటం విశేషం.
ఇదిలా ఉండగా...ఇవాళ ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. హైదరాబాద్ లోని హెచ్ ఐసీసీలో ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు జరిగే ప్రపంచ కాంగ్రెస్ ఐటీ సదస్సుకు రావాలని రాష్ట్రపతిని కేటీఆర్ ఆహ్వానించారు. నాస్కామ్ ఆధ్వర్యంలో ఈ ఐటీ సదస్సు జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 150 మంది పారిశ్రామిక వేత్తలు హాజరు కానున్న ఈ సమావేశంలో మొత్తం 50 సెషన్లు జరగనున్నాయి. మొత్తం 30 దేశాల నుంచి ఆహ్వానితులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు.