Begin typing your search above and press return to search.
సీమాంధ్ర ఓట్ల కోసం బాగానే అవస్తలు పడుతున్నాడే!
By: Tupaki Desk | 28 Nov 2020 1:30 AM GMTగ్రేటర్ ఎన్నికలు ఊపందుకున్నప్పటి నుండి సీమాంధ్ర ఓట్ల కోసం కేటీయార్ బాగానే అవస్తలు పడుతున్నారు. కేంద్రానికి సంబంధించిన ఏ అంశం వచ్చినా తెలంగాణాతో పాటు ఏపిని కూడా కలుపుకునే మాట్లాడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన రియల్ ఎస్టేట్ సమ్మిట్-2020 లో మాట్లాడుతూ రెండుగా విడిపోయిన తెలంగాణా, ఆంధ్రాలను కేంద్రం మోసం చేసిందన్నారు.
కేంద్రంలోని నరేంద్రమోడి ప్రభుత్వం తెలంగాణాను ఎండగట్టిందంటూ మండిపోయారు. డిసెంబర్ 1వ తేదీన జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయాలంటూ పిలుపిచ్చారు. ఆమధ్య మాట్లాడుతూ అమరావతి అభివృద్దికి మోడి చెంబుడు మంచీనీళ్ళు తట్టెడు మట్టి తప్ప ఏమిచ్చారంటూ ఎద్దేవా చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.
అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ అమరావతి సరైన ప్లేసు కాదని విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు మొన్ననే ఆంధ్రాను తొక్కేశాం అని కేసీఆర్ డ్యామేజింగ్ కామెంట్లు చేశారు. తండ్రేమీ ఆంధ్రులను అవమానిస్తూ, కొడుకు మాత్రం ఆంధ్రులను పొగిడితే ఎంత మేర ప్రయోజనం ఉంటుందో చూడాలి మరి.