Begin typing your search above and press return to search.
ఇంకో పాయింట్ తో మోడీని టార్గెట్ చేస్తున్న కేటీఆర్
By: Tupaki Desk | 7 Feb 2022 11:30 AM GMTగత కొద్దికాలంగా తెలంగాణలో రాజకీయాలు టీఆర్ఎస్ - బీజేపీ అన్నట్లుగా మారుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందని, వివిధ అంశాల్లో నిర్ణయాలే దీనికి తార్కాణమని కేంద్రం కేటాయింపులను ఉదహరిస్తూ టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఇదే ఒరవడిలో సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ సైతం స్పందిస్తున్నారు. తాజాగా మరో కీలక పాయింట్లో కేంద్రాన్ని కేటీఆర్ టార్గెట్ చేశారు.
తెలంగాణ సంపదగా పేరొందిన సింగరేణి విషయంలో కేంద్ర వైఖరిపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గత ఏడేళ్ల కాలంలో అభివృద్ధి ప్రస్థానంలో అద్భుతంగా ముందుకు వెళ్తున్న సింగరేణి సంస్థను ప్రయివేటీకరణ చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అది కోల్ మైన్ కాదు.. గోల్డ్ మైన్ అని కేటీఆర్ స్పష్టం చేశారు. సింగరేణి జోలికి వస్తే ఢిల్లీ తల్లడిల్లాల్సిందే అని, బీజేపీపై మరో ఉద్యమం తప్పదు ఆయన తేల్చిచెప్పారు. కేంద్ర మెడలు వంచిన రైతు పోరాటాన్ని మరిపించే మరో ఉద్యమానికి సింగరేణి కార్మికులు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి మంత్రి కేటీఆర్ ఘాటైన లేఖ రాశారు.
సింగరేణిలో ఉన్న జెబిఅర్ఒసి -3, కేకే -6, శ్రవనపల్లీ ఓసీ, కోయ గూడెం గనులను సింగరేణి సంస్థకు కేటాయించకుండా వాటికోసం వేలంలో పాల్గొనాలని నిర్దేశించడంపైన మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గత ఏడేళ్ల కాలంలో 450 లక్షల టన్నుల ఉత్పత్తి నుంచి 670 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగిందని, దీంతోపాటు బొగ్గు తవ్వకాలు, రవాణా, లాభాలు, కంపెనీ విస్తరణ విషయంలోనూ సింగరేణి గణనీయమైన ప్రగతిని సాధిస్తూ వస్తున్నదని కేటీఆర్ పేర్కొన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తున్న ధర్మల్ విద్యుత్ కేంద్రం దేశంలోనే అత్యుత్తమ పి ఎల్ ఎఫ్ ను కలిగి ఉందన్నారు. కేవలం సింగరేణి రాష్ట్రానికే పరిమితం కాకుండా మహారాష్ట్ర తోపాటు పలు దక్షిణాది రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు భారీ ఎత్తున బొగ్గు సరఫరా అందిస్తూ దేశానికి విద్యుత్తు కాంతులను విరజిమ్ముతున్నదన్నారు.
లాభాల బాటలో అద్భుతమైన ప్రగతిపథంలో ఉన్న సింగరేణిని బలహీనపరిచి, నష్ట పూరిత పబ్లిక్ సెక్టార్ కంపెనీగా మార్చి అంతిమంగా ప్రైవేటుపరం చేసే కుట్రను కేంద్రంలోని బీజేపీ అమలు చేస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. ఉద్యమాలకు కేరాఫ్ గా నిలిచిన సింగరేణి కార్మికులు మరోసారి ఉక్కుపిడికిళ్లు బిగించడం ఖాయమని, కేంద్రంలోని బీజేపీని వెంటపడి తరమడం తథ్యమని రాష్ట్ర మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. సింగరేణి కాపాడుకునేందుకు మేము అన్ని విధాలుగా సింగరేణి బిడ్డలకు, కార్మికులకు అండగా ఉంటామని, వారితో కలిసి ఉద్యమ కార్యాచరణ చేపడతామన్నారు.