Begin typing your search above and press return to search.

వాణీ దేవి లో బ్రాహ్మణ కోణం బయటకు తీసుడా?ఇదెక్కడి వ్యూహం?

By:  Tupaki Desk   |   8 March 2021 6:30 AM GMT
వాణీ దేవి లో బ్రాహ్మణ కోణం బయటకు తీసుడా?ఇదెక్కడి వ్యూహం?
X
ఎన్నికల వేళ అప్రమత్తత చాలా అవసరం. ఏ చిన్న పొరపాటు దొర్లినా మొదటికే మోసం వస్తుంది. అందరిని కలుపుకుపోతూ.. అన్ని వర్గాల సహకారంతోనే ఎన్నికల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. బరిలోఉన్న అభ్యర్థి సామాజిక వర్గంఎన్నికల గెలుపులో కీలకభూమిక పోషించినా.. మేం ఫలానా సామాజిక వర్గానికి చెందిన వాళ్లం.. మా జాతి వాళ్లంతా మమ్మల్ని గెలిపించటానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారని అభ్యర్థి అంటే ఎలా ఉంటుంది? ఒకవేళ అభ్యర్థి అనకున్నా.. పార్టీ కీలక నేత సదరు సామాజిక వర్గానికి చెందిన సభకు హాజరై.. కీలకవ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటుంది? ఎలాంటి సందేశం వెళుతుంది? అన్నది అసలు ప్రశ్న.

హైదరాబాద్.. రంగారెడ్డి.. మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ప్రధాని పీవీ కుమార్తె వాణీదేవి బరిలో ఉన్నారు. ఆమెను గెలిపించాలని కోరుతూ.. హైదరాబాద్ లో బ్రాహ్మణులు ఒక సభను ఏర్పాటు చేయటం.. దానికి మంత్రి కేటీఆర్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యకరంగా మారాయి. ప్రస్తుతం మీడియా.. సోషల్ మీడియా శక్తివంతంగా పని చేస్తున్న వేళ.. నోటి నుంచి వచ్చే ప్రతి మాట లెక్కలోకి వెళుతుందన్నది అసలు మర్చిపోకూడదు.

చూస్తుంటే.. మంత్రి కేటీఆర్ అలాంటివేమీ పట్టించుకున్నట్లుగా లేదు. అన్నింటికి మించి వాణీదేవిలోని బ్రాహ్మణ కోణాన్ని బయటకు తీసి.. అదే విషయం మీద ప్రధానంగా మాట్లాడితే మిగిలిన సామాజిక వర్గాల వారి మనోభావాలు ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. ఎందుకిలా అంటే.. ఒక వర్గాన్ని ఆకాశానికి ఎత్తేస్తుంటే.. మిగిలిన వారు అంతో ఇంతో కోరుకుంటారు. అలా అని.. అన్ని సామాజిక వర్గాలతో సభలు ఏర్పాటు చేయటం అంత తేలికైన పనికాదు. అలాంటప్పుడు ఒక సామాజిక వర్గానికి చెందిన సభను ఏర్పాటు చేసి.. దానికి మంత్రి కేటీఆర్ లాంటివాళ్లు వెళ్లి ఓట్లను అర్థించటం మిగిలిన వారు వేలెత్తి చూపేలా చేస్తుందన్నది మర్చిపోకూడదు.

తాజాగా జరిగిన సభలో మాట్లాడిన కేటీఆర్ మాటల్నే తీసుకుంటే.. కీలకమైన ఎన్నికల వేళ.. టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న వాణీదేవిలోని బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని బయటకు తీయాల్సిన అవసరం ఉందా? అన్నది ప్రశ్న. ఆమె సైతం తన గురించి తాను పెద్దగా చెప్పుకోని బ్రాహ్మణకోణాన్ని కేటీఆర్ ప్రస్తావించిన తీరుచూస్తే.. ఎన్నికల్లో ఇదెక్కడి వ్యూహం అన్న భావన కలుగక మానదు.

కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని చూస్తే..
- బ్రాహ్మణుల ఉత్సాహాన్ని చూస్తుంటే వాణీదేవి గెలుపు ఖాయమైపోయిందనిపిస్తుంది
- సీఎం కేసీఆర్‌కు బ్రాహ్మణులు, భక్తిపట్ల చిత్తశుద్ధి ఉంది.
- గతంలో గెలిచిన బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావు బ్రాహ్మణులకు, న్యాయవాదులకు చేసిందేమీలేదు.
- బ్రాహ్మణుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టింది.