Begin typing your search above and press return to search.

సమతామూర్తి విగ్రహావిష్కరణపై సోషల్ వార్..: దుమారం లేపిన కేటీఆర్ ట్వీట్

By:  Tupaki Desk   |   6 Feb 2022 1:33 PM GMT
సమతామూర్తి విగ్రహావిష్కరణపై సోషల్ వార్..: దుమారం లేపిన కేటీఆర్ ట్వీట్
X
ముచ్చింతల్ సమతామూర్తి విగ్రహావిష్కరణ రాజకీయ దుమారం లేపుతోంది. సోషల్ మీడియాలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య నెట్ వార్ సాగుతోంది. రామానుజచార్యలు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని మోదీ వచ్చినా.. కేసీఆర్ డుమ్మా కొట్టాడని బీజేపీ నేతలు విమర్శలు చేశారు. దీంతో టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రధానిపై సంచలన కామెంట్స్ చేశారు. దీంతో ఇరు పార్టీల మధ్య విమర్శల వేడి పుడుతోంది. ఒకరి కంటే మరొకు రాజకీయ విమర్శలు చేయడంతో సోషల్ మీడియా హీటెక్కిపోతుంది.

సమతామూర్తి (స్టాట్యూ ఆఫ్ ఈక్వీటీ) విగ్రహాన్ని శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. రంగారెడ్డి జిల్లాలోని ముచ్చింతల్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ ఆశ్రమానికి మోదీ సాంప్రదాయ దుస్తుల్లో వచ్చారు. ఆయనకు స్వామిజీ చినజీయర్ స్వామిజీ సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం 120 కిలోల బంగారపు విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించి ప్రసంగించారు. అయితే మోదీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన పెట్టిన పోస్టుపై బీజేపీ నాయకులు ప్రతిగా స్పందిస్తున్నారు. ఇంతకీ కేటీఆర్ ఏం పోస్టు పెట్టాడంటే..?

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంత్రుల్లో కేటీఆర్ ఒకరు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలున్న ఆయన ట్విట్టర్ ద్వారా నిత్యం స్పందిస్తుంటారు. అంతేకాకుండా సంచలనాల పోస్టు పెడుతూ ఉంటారు. తాజాగా ఆయన మరో హాట్ కామెంట్స్ చేస్తుూ పోస్టు చేశారు. ముచ్చింతల్ లోని రాజానుజాచార్యుల విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించడంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వివక్షకు మారుపేరైనా మోదీ సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారని అన్నారు. ఇది సమతామూర్తి స్ఫూర్తికే విరుద్ధమని అన్నారు.

అయితే కేటీఆర్ ట్విట్ కు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రతిస్పందించారు. ఇది ‘బర్నల్ మూమెంట్’ అని రీ ట్వీట్ చేశారు. మోదీని చూసి టీఆర్ఎస్ నేతలు అసూయపడుతున్నారని అన్నారు. దీంతో మరోసారి బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ట్వీట్ వార్ కంటిన్యూ అవుతోంది. గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కేంద్రంతో తాడోపేడో అన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతోకేటీఆర్ సైతం ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. తాజాగా సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమంపై మోదీని టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే శనివారం ‘స్టాట్యూ ఆప్ ఈక్వీటీ’ అనే పదం ట్రెండింగ్ గా మారింది. ఇప్పుడీ పోస్టు కూడా వైరల్ గా మారింది.