Begin typing your search above and press return to search.
బాబు కాపీ క్యాట్ అని కేటీఆర్ ఫిర్యాదు
By: Tupaki Desk | 5 July 2016 4:20 PM GMTతెలుగు రాష్ర్టాల మధ్య వివాదాలు - ఫిర్యాదుల పర్వంలోకి ఇపుడు గుర్తింపు సమస్య వచ్చిచేరింది. వ్యాపార అనుకూల రాష్ర్టాల గుర్తింపు పొందే క్రమంలో తమ సమాచారాన్ని - విధానాన్ని ఏపీ సర్కారు కాపీ కొట్టిందని తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. పరిశ్రమల శాఖా మంత్రిగా ఉన్న సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వంపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ ల కోసం తామిచ్చిన సమాచారాన్ని కాపీ చేశారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేటీఆర్ పరిధిలోని తెలంగాణ పరిశ్రమల శాఖ ఫిర్యాదు చేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో ఏపీ ఒక్కసారిగా తొలి స్థానానికి వచ్చిన సంగతి తెలిసిందే. కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఏపీ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరుకోవడానికి తాము ఈ ర్యాంకింగ్స్ కోసం ఇచ్చిన సమాచారాన్ని ఏపీ కాపీ చేయడమే కారణమని తెలంగాణ పరిశ్రమల శాఖ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయమై కేంద్రానికి ఫిర్యాదు చేయడంతోనే వదిలిపెట్టకుండా సైబర్ క్రైమ్ కూడా దరఖాస్తు చేసుకుంది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటున్నట్లు కేటీఆర్ తాను విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.