Begin typing your search above and press return to search.
ఇందుకే కేటీఆర్ ను జనాలు ఇష్టపడేది..
By: Tupaki Desk | 26 Jan 2019 11:53 AM GMTగత కొన్నేళ్లలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎంత మంచి నాయకుడిగా ఎదిగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేసీఆర్ లాంటి నాయకుడి వారసత్వంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తి ఆయన్ని మ్యాచ్ చేయడమంటే మామూలు విషయం కాదు. కానీ తండ్రికి తగ్గ తనయుడిగా త్వరగానే గుర్తింపు సంపాదించిన కేటీఆర్.. కొన్ని విషయాల్లో తండ్రిని కూడా మించి పోయాడంటే అతిశయోక్తి ఏమీ కాదు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ.. అక్కడ తన దృష్టికి వచ్చే సమస్యల్ని వెంటనే పరిష్కరిస్తూ.. బయట కూడా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. తరచుగా జనాలతో ఇంటరాక్ట్ అవుతూ.. సినిమా వేడుకలకు హాజరవుతూ.. అప్పుడప్పుడూ సినిమాలు చూస్తూ వాటిపై స్పందించడం ద్వారా తానూ జనాల్లో ఒకడనే భావన కలిగించడం ద్వారా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు కేటీఆర్.
మామూలుగా నాయకులు ఎన్నికల సమయంలో ఇలాంటి కొన్ని గిమ్మిక్కులు చేస్తుంటారు. కానీ కేటీఆర్ ఎప్పుడూ అలాగే ఉంటాడు. ఎన్నికల తర్వాత కూడా ఆయన జనాల్లో తిరుగుతూ.. ఒక సామాన్యుడిలాగే మెలుగుతున్నాడు. తాజాగా కేటీఆర్ హైదరాబాద్ నడిబొడ్డున బాగా ఫ్యామస్ అయిన ‘ఫ్యామస్ ఐస్ క్రీం పార్లర్’కు వచ్చాడు. అక్కడ జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఐస్ క్రీం తిన్నాడు. పాపులర్ ఫ్లేవర్లన్నీ టేస్ట్ చేశాడు. జనాల్లో ఒకడిలా ఒక టేబుల్ దగ్గర మామూలుగా కూర్చుని ఐస్ క్రీం రుచి చూశాడు. హైదరాబాద్ వాసులందరికీ నాంపల్లిలోని ఈ ఐస్ క్రీం జంక్షన్ బాగా పరిచయం. ఇక్కడ కేటీఆర్ వచ్చి ఐస్ క్రీం తినడం జనాల దృష్టిని బాగా ఆకర్షించింది. సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటోలు వైరల్ కాగా.. అందరూ కేటీఆర్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. కేటీఆర్‌ను జనాలు ఇష్టపడేది ఇందుకే అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.