Begin typing your search above and press return to search.

ఇక నుంచి నాదే బాధ్యత- కేటీఆర్

By:  Tupaki Desk   |   30 Dec 2018 9:56 AM GMT
ఇక నుంచి నాదే బాధ్యత- కేటీఆర్
X
ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ గెలువలేదని.. తెలంగాణ ప్రజానీకం గెలిచిందని టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారాకరామారావు అన్నారు. హైదరాబాద్ లోని కూకట్ పల్లి నియోజకవర్గంలో జరిగిన టీఆర్ ఎస్ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. టీఆర్ ఎస్ గెలుపుపై విశ్లేషించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ భారీ మెజార్టీతో గెలువడానికి మూడు కారణాలు ఉన్నాయని తెలిపారు. కేసీఆర్ నాయకత్వం.. ప్రజల ఆశీర్వాదం.. టీఆర్ ఎస్ నాయకులు - కార్యకర్తల కృషే గులాబీ జెండా ఎగురడానికి కారణమని వివరించారు. తమకు సహకరించిన ప్రతిఒక్కరికి ఈ విజయంలో వాటా దక్కుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇది అద్భుతమైన విజయమని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే ఉత్సాహంతో పనిచేస్తే 16 ఎంపీ స్థానాలు గెలుచుకుంటే ఢిల్లీని శాసించే అవకాశం వస్తుందని కేటీఆర్ వివరించారు. ఆ దిశగా నాయకులు - కార్యకర్తలు పని చేయాలన్నారు.

టీఆర్ ఎస్ పాలనలో చేసిన పనుల వల్ల ఇప్పటి నుంచి కిందటి ఎన్నికల్లో పార్టీకి దూరమైన వర్గాలను దగ్గరకు చేర్చుకేనేలా పని చేస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. ఆ వర్గాలను తమ పని తీరుతో మెప్పించి లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున తాను హామీ ఇస్తున్నానని తెలిపారు. ఇక్కడ ఉన్నవారు ఆంధ్రా - కర్ణాటక - పంజాబ్ - బెంగూళూరు - దేశంలోని ఏ రాష్ట్రం నుంచి వచ్చిన స్థిరపడిన వారంతా తమ సోదరులేనని అన్నారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం మీ అందరి కోసం పని చేస్తుందని - ఎవరిపై కక్ష సాధింపు ఉండదని స్పష్టం చేశారు. అందరిపట్ల ఒకే ధోరణితో త్రికరణశుద్ధిగా పని చేస్తుందని చెప్పారు. కూకట్ పల్లికి టీఆర్ ఎస్ ఇచ్చిన హామీలు అమలు చేసే బాధ్యత కూడా తనదేనని ఆయన స్పష్టం చేశారు.

ఇక త్వరలో జరుగబోయే పంచాయతీ ఎన్నికల్లో సత్త చాటుతామని - ఆ తర్వాత జరగబోయే లోక్ సభ ఎన్నికల విజయ దుందుభి మోగించబోతున్నామని అన్నారు. మొన్నటి జీహెచ్ ఎంసీ ఎన్నికలు - నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ గెలుపుతో మరింత తనకు మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఇప్పుడు పంచాయతీ - లోక్ సభ ఎన్నికల్లోనూ పార్టీని గెలిపించేందుకు పాటుపడుతానని వివరించారు.


Watch Here: పవన్ కళ్యాణ్ పావలా అయితే నీ రేటు ఎంత..?