Begin typing your search above and press return to search.

ఒక్క రోజులో కేటీఆర్ మీటింగ్ లు ఎన్నో తెలుసా?

By:  Tupaki Desk   |   26 Jan 2018 5:19 AM GMT
ఒక్క రోజులో కేటీఆర్ మీటింగ్ లు ఎన్నో తెలుసా?
X
పెట్టుబ‌డులు ఆక‌ర్షించేందుకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ దూసుకెళుతున్నారు. ఇప్ప‌టికే ప‌లుమార్లు దావోస్ ప‌ర్య‌ట‌న‌కు ఆహ్వానం అందినా వెళ్ల‌ని తెలంగాణ స‌ర్కారు.. తొలిసారి రాష్ట్ర ఐటీ మంత్రి నేతృత్వంలో బృందం దావోస్ వెళ్లింది. అక్క‌డ స్వ‌దేశీ.. విదేశీ పారిశ్రామిక‌వేత్త‌ల్ని క‌లుసుకోవ‌టంతోపాటు.. తెలంగాణ‌కు పెట్టుబడుల కోసం చేస్తున్న ప్ర‌య‌త్నాలు అన్నిఇన్ని కావు.

విదేశీ ప‌ర్య‌ట‌న అన్న వెంట‌నే ఒక స‌మావేశానికి హాజ‌రు కావ‌టం.. తిర‌గ‌టంగా ప‌లువురు భావిస్తుంటారు. కానీ.. అంది వ‌చ్చిన అవ‌కాశాల్ని అందిపుచ్చుకోవ‌టానికి ఎంతగా క‌ష్ట‌ప‌డ‌తార‌న్న విష‌యం పెద్ద‌గా బ‌య‌ట‌కు రాదు. తాజాగా దావోస్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న మంత్రి కేటీఆర్ ఒక్క గురువారం రోజులో ఏకంగా 30 మంది పారిశ్రామివేత్త‌ల‌తో భేటీ అయ్యారంటే.. ఆయ‌న షెడ్యూల్ ఎంత టైట్ గా ఉందో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు.

30 మంది పారిశ్రామిక దిగ్గ‌జాల‌తో భేటీ కావ‌టం.. వారికి తెలంగాణ‌లో ఉన్న అవ‌కాశాల గురించి ఇంప్రెస్ అయ్యేలా వివ‌రాలు అందించ‌టం.. ఎవ‌రికి వారికి.. వారి అవ‌స‌రాలు తెలంగాణ రాష్ట్రంలో ఎలా తీర‌తాయో చెప్ప‌టం చాలా కీల‌కం. అంతేనా.. పెట్టే పెట్టుబ‌డులకు లాభం ఎంత మేర లాభం చేకూరుతుందో చెప్ప‌టంతో పాటు.. వారికెంత అనుకూలంగా తెలంగాణ ప్ర‌భుత్వ పాల‌సీలు ఉన్నాయో వివ‌రించాల్సి ఉంటుంది.

ఇందుకోసం గంట‌ల కొద్దీ టైం ఉండ‌దు. దొరికే స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే పారిశ్రామిక దిగ్గ‌జాల్ని ఆక‌ర్షించేలా వ్య‌వ‌హరించాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ తో పాటు.. ఇత‌ర ప‌ట్ట‌ణాల్లో ఉన్న అవ‌కాశాల గురించి వివ‌రించటం కీల‌కం. ఆ ప‌నిని ఇప్ప‌టికే ఎఫెక్టివ్ గా చెబుతున్న కేటీఆర్‌.. ఎట్ట‌కేల‌కు మ‌హీంద్ర ఛైర్మ‌న్ మ‌న‌సు దోచుకోవ‌ట‌మే కాదు.. త‌మ కొత్త ప‌రిశ్ర‌మ‌ను తెలంగాణ‌లో ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు చెప్పారు.

అంతేకాదు.. మ‌రో తీపి క‌బురును కేటీఆర్‌ కు ఆనంద్ మ‌హీంద్రా చెవిన వేశారు. అదేమంటే.. ప్ర‌తి ఏటా ఫిన్లాండ్ రాజ‌ధాని హెల్సింకీలో జ‌రిగే అతి పెద్ద అంకుర ప‌రిశ్ర‌మ‌ల స‌ద‌స్సును ఈసారి హైద‌రాబాద్‌ కు తీసుకొస్తాన‌ని కేటీఆర్‌ కు మాట ఇవ్వ‌టం గ‌మ‌నార్హం. దీనిపై ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ను క‌లుస్తాన‌ని చెప్పగా.. అందుకు కేటీఆర్ ఓకే చెబుతూ.. హైద‌రాబాద్‌ కు ఇన్వైట్ చేశారు.

ఆనంద్ మ‌హీంద్ర‌తో పాటు.. గురువారం ఒక్క‌రోజులో మొత్తం 30 మంది పారిశ్రామిక దిగ్గ‌జాల‌తో కేటీఆర్ భేటీ కావ‌టం గ‌మ‌నార్హం. ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కూ సాగిన నాన్ స్టాప్ మీటింగ్ ల‌లో ఎవ‌రెవ‌రిని మంత్రి కేటీఆర్ క‌లిసిన వారిలో..

+ ప్రముఖ వైమానిక సంస్థ లాఖీడ్‌ మార్జిన్‌ ఉపాధ్యక్షుడు రిచర్డ్‌ ఆంబ్రోస్

+ ఆదాని సంస్థ ఛైర్మన్‌ గౌతం ఆదాని

+ పైజర్‌ వాక్సిన్‌ అధ్యక్షురాలు సుసాన్‌ సిలబెర్మన్

+ సీఏ సంస్థ గ్లోబల్‌ సీఈవో మైక్‌ గ్రెగరీ

+ ప్రపంచంలోనే అతిపెద్ద సౌరవిద్యుత్‌ ప్యానళ్ల తయారీ సంస్థ ట్రినా సోలార్‌ ఉపాధ్యక్షులు రొంగ్‌ పాంగైన్‌

+ అబ్రాజ్‌ సంస్థ భాగస్వామి కిటో డి బోయర్‌

+ ఫిలిప్ప్‌ ప్రతినిధులు

+ టాటా గ్రూపు సంస్థల ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌

+ బజాజ్‌ సంస్థల ఛైర్మన్‌ రాహుల్‌

+ హీరో మోటా కార్ప్‌ సీఈవో పవన్‌ ముంజాల్‌

+ ఉదయ్‌ కొటక్‌

+ వెల్‌ స్పన్‌ గ్రూపు ఛైర్మన్‌ బీకే గోయెంకా త‌దిత‌రులు