Begin typing your search above and press return to search.
ఆ నెటిజన్ ట్వీట్ కు కేటీఆర్ మైండ్ బ్లాంక్!
By: Tupaki Desk | 28 May 2021 5:30 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ నెట్టింట అందుబాటులో ఉండే సంగతి తెలిసిందే. ప్రజలతో అనుసంధానం అయ్యేందుకు , వివిధ సమస్యలు పరిష్కరించేందుకు ఆయన ట్విట్టర్ వేదికగా ఉపయోగించుకుంటుంటారు. ట్విట్టర్ ద్వారా ఆయన అనుసంధానం అవుతున్న తీరుతో పలు సమస్యలు పరిష్కారం అవుతుంటాయి. అయితే, తాజాగా ఓ నెటిజన్ చేసిన ట్వీట్ మాత్రం ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. ఇదంతా కేటీఆర్ మంచితనం ఫలితమా? లేక నెటిజన్ అతి చేశాడా అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇంతకీ ట్వీట్ ఏంటంటే... ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌కు చిత్రమైన ట్వీట్ చేశారు. ``సర్ నేను లెగ్ పీస్ ఉన్న మసాల దట్టించిన బిర్యానీ ఆర్డర్ చేశాను. అయితే, ఇదిగో ఈ బిర్యానీ ఇచ్చారు. ఇదేనా అండి ఇచ్చే విధానం?`` అంటూ మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేసి ట్వీట్ చేశాడు. దీనికి ఆశ్చర్యపోవడం కేటీఆర్ వంతు అయింది. ``ఇందులో నన్నెందుకు ట్యాగ్ చేశావు బ్రదర్? ఈ ట్వీట్ ద్వారా నా నుంచి ఏం ఆశిస్తున్నావు?`` అంటూ ప్రశ్నించారు.
మంత్రి కేటీఆర్‌కు వచ్చిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. సదరు నెటిజన్ ఆసక్తి, కామెంట్ చిత్రంగా మారింది. అయితే, ట్విస్ట్ ఇక్కడితోనే ముగిసిపోలేదు. దీనికి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ``కేటీఆర్ ఆఫీస్ స్పందించాలని బహుశా ఆ నెటిజన్ ట్వీట్ చేసినట్లున్నారు. కరోనా సమయంలో మీరు వైద్య సేవల్లో బిజీగా ఉన్నారని వారికి తెలియజేయండి``అంటూ ఆయన కామెంట్ చేశారు.