Begin typing your search above and press return to search.
ఈ ఇష్యూలో జగన్ సర్కారును ఫాలో కండి కేటీఆర్
By: Tupaki Desk | 27 March 2020 11:50 AM GMTకరోనా వేళ.. అంతా ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయన్నది అస్సలు మర్చిపోకూడదు. ఎంత ఆప్తులైనా.. మరెంత ముఖ్యమైనా సామాజిక దూరాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు.. ఎవరికి వారు వారి.. వారి ఇళ్లకే పరిమితం కావటం అత్యవసరం. అందుకు భిన్నంగా ఎప్పటిలా వ్యవహరిస్తే.. మొదటికే మోసం ఖాయం. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని అభినందించాల్సిందే. నిజమే.. సొంతరాష్ట్రానికి చెందిన వారు అయితే మాత్రం.. వేలాదిగా ఒక్కసారిగా రాష్ట్రంలోకి వచ్చేసి.. వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి.. వారి కారణంగా కరోనా వ్యాప్తి చెందితే.. కోట్లాది మంది ప్రభావం చెందుతారన్నది అస్సలు మర్చిపోకూడదు.
ఇలాంటివేళ.. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన ఒక రిక్వెస్టు సంగతి చూడాలి. హైదరాబాద్ కు చెందిన ముస్లింలు కొందరు ప్రఖ్యాత అజ్మీర్ దర్గాకు వెళ్లటం.. తిరిగి వచ్చే వేళలో మార్గమధ్యంలో ఇరుక్కుపోయారు. రాజస్థాన్.. మధ్యప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో వారు చిక్కుకుపోయారు. దీంతో.. తమను ఆదుకోవాలని.. హైదరాబాద్ కు తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నది వారి వాదన.
నిజమే.. వారి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే.. ఇప్పుడున్నపరిస్థితుల్లో వారిని హైదరాబాద్ వరకూ తీసుకొచ్చే కన్నా.. అక్కడే ఎక్కడైనా ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది కదా? అన్నది ఒక ఆలోచన. అసద్ లాంటి జాతీయ నెట్ వర్క్ ఉన్న నేత.. వారికి ఏర్పాట్లు చేయలేరా? అన్నది ప్రశ్న. ఒకవేళ.. వారిని హైదరాబాద్ కు తీసుకొస్తే.. ఏం చేయాలన్న అంశంపై ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలన్నది మర్చిపోకూడదు.
తమ సొంత రాష్ట్రానికి చెందిన వారు హైదరాబాద్ నుంచి ఏపీలోకి వస్తామంటే.. జగన్ ప్రభుత్వం ఎలాంటి మొహమాటం లేకుండా నో చెప్పేసింది. ఈ కరకు నిర్ణయం వెనుక.. కోట్లాది మంది ఏపీ ప్రజల ఆరోగ్యం మీద ఉన్న అవగాహనగా చెప్పొచ్చు. ఇదే తీరును ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రదర్శించాలి. అజ్మీర్ నుంచి వస్తున్న హైదరాబాదీయుల్ని.. క్వారంటైన్ సెంటర్ కు తరలించి.. పద్నాలుగు రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉంచిన తర్వాత మాత్రమే వారిని వారి ఇళ్లకు వెళ్లేందుకు అనుమతించాలన్నది మర్చిపోకూడదు. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినా.. అందుకు తగ్గ మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నది మంత్రి కేటీఆర్ గుర్తుంచుకుంటే మంచిది.