Begin typing your search above and press return to search.
ఛాన్సు దొరికితే వదిలిపెట్టని కేటీఆర్.. తాజాగా అతడికి ట్వీట్ పంచ్
By: Tupaki Desk | 5 April 2022 4:31 AM GMTసోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం ఇప్పటి రాజకీయ నేతలకు చాలా అవసరమైన వ్యవహారం. తమ సోషల్ మీడియా ఖాతాలతో ప్రజలకు దగ్గరయ్యేలా కొందరు ఉంటే.. మరికొందరు మాత్రం రాజకీయ అవసరాల కోసం ఖాతాల్ని ఉంచుకొని.. అప్పుడప్పుడు రియాక్టు అవుతుంటారు. మరికొందరు మాత్రం డైలీ బేసిస్ లో ట్వీట్లు చేస్తుంటారు. తెలంగాణ రాష్ట్ర చిన్న బాస్.. టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ మాత్రం వీరందరికి భిన్నం. తనకు చిక్కే ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టకుండా విరుచుకుపడటం.. పంచ్ లతో ఉక్కిరి బిక్కిరి చేయటం ఆయనకు అలవాటు.
వేదిక ఏదైనా.. వ్యక్తి ఎవరైనా సరే.. తెలంగాణ ఇమేజ్ ను పెంచేలా ఆయన తన ట్విటర్ ఖాతాలో పోస్టులు పెడుతుంటారు. జాతీయ.. అంతర్జాతీయ అంశాలపై అవసరానికి తగినట్లుగా స్పందించే ఆయన.. తాజాగా కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు ట్వీట్ పంచ్ ఇచ్చారని చెప్పారు. పేరుకు ఆసక్తికర సంభాషణ అన్నట్లు కనిపించినప్పటికీ.. భారతదేశ సిలికాన్ వ్యాలీగా అభివర్ణించే గార్డెన్ సిటీ బెంగళూరు ఇమేజ్ ఎంత దారుణంగా పడిపోయిందన్న విషయాన్ని చెబుతూనే.. తనదైన శైలిలో సవాలు విసిరారు. అసలేం జరిగిందంటే.. బెంగళూరు మహానగరంలో మౌలిక సదుపాయాలు సరిగా లేవని హౌసింగ్.
కామ్.. ఖాతాబుక్ వ్యవస్థాపకుడు రవీశ్ నరేశ్ ఇటీవల ఒక ట్వీట్ చేశారు. భారత సిలికాన్ వ్యాలీలో స్టార్టప్ లు ఇప్పటికే మిలియన్ డాలర్ల పన్నులు చెల్లిస్తున్నా.. చెత్త రహదారులు ఉన్నాయని.. రోజూ దాదాపు కరెంటు కోతలే.. నీటి సరఫరా కూడా అంతంతమాత్రమే అంటూ ట్వీట్ చేసి కర్ణాటకలోని బీజేపీ సర్కారు తీరును తప్పు పట్టారు.
దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్.. "మీ బ్యాగులు సర్దుకొని హైదరాబాద్ కు వచ్చేయండి. మా దగ్గర భౌతికంగా.. సామాజికంగా మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి. మా ప్రభుత్వం ఇన్నోవేషన్.. ఇన్ ఫ్రాస్ట్రక్చర్.. ఇన్ క్లూజివ్ గ్రోత్ లపై ద్రష్టి పెట్టి పని చేస్తుంది" అని పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్ ట్వీట్ కు స్పందించిన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ స్పందిస్తూ.. 2023 నాటికి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. అనంతరం బెంగళూరు ఖ్యాతిని పునరుద్దరించి.. దేశంలో ఉత్తమ నగరంగా తీర్చిదిద్దుతామంటూ సవాలు విసిరారు. దీనికి స్పందించిన కేటీఆర్.. 'శివకుమార్ అన్న.. నాకు కర్ణాటక రాజకీయాల గురించి పెద్దగా తెలీదు. అక్కడ ఎవరు గెలవబోతున్నారన్న విషయం తెలీదు.
కానీ.. మీ సవాల్ ను స్వీకరిస్తున్నా. హైదరాబాద్ - బెంగళూరు మధ్య ఆరోగ్యవంతమైన పోటీ ఉండాలని కోరుకుంటున్నా. హలాల్.. హిజాబ్ లాంటి వాటిపై కాకుండా మౌలిక సదుపాయాలు.. ఐటీ వ్యాపారాలపై ఫోకస్ పెడితే మంచిది' అంటూ తనదైన శైలిలో ట్వీట్ పంచ్ ఇచ్చేశారు. తన ట్వీట్ తో డీకే కు పంచ్ ఇస్తూ.. రాష్ట్రంలోని బీజేపీ సర్కారు తీరును తప్పు పట్టినట్లుగా ఉన్న ట్వీట్లు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.