Begin typing your search above and press return to search.
కేసీఆర్ పెద్దోడయ్యేసరికి వారిద్దరి రిటైర్మెంట్?
By: Tupaki Desk | 29 Nov 2016 4:34 PM GMTతెలంగాణ రాజకీయాలు ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టూ తిరుగుతున్నట్లు చెబుతుంటారు. వాస్తవానికి అందులో కొంతమాత్రమే నిజముందని చెప్పాలి. అధికారికంగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆరే అయినా.. ఆయన హాజరు కావాల్సిన స్థాయి ఉన్న కార్యక్రమాలన్నింటిలోనూ ఆయన కనిపించరు. అయితే.. ఆయన స్థానాన్ని భర్తీ చేయటానికి అక్కడ మంత్రి కమ్ కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కనిపిస్తారు.
సినిమా ఫంక్షన్ కావొచ్చు.. 10కే రన్ కావొచ్చు.. మరింకేదైనా కార్యక్రమం కావొచ్చు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇలా వ్యవహరించే వారి విషయంలో విమర్శలు చెలరేగుతుంటాయి. కానీ.. కేటీఆర్ విషయంలో అలాంటివి మినహాయింపుగా చెప్పాలి. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఎలాంటి విమర్శలు.. ఆరోపణలు వెల్లువెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవటమే కాదు.. రాజ్యాంగేతర శక్తిగా అవతరిస్తున్నారన్న పేరు రాకుండా ఉండటంలో విజయవంతం అయ్యారని చెప్పాలి. అలాంటి ఆయన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఒక ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర అంశాలు చెప్పుకొచ్చారు.
తమ బాస్ కేసీఆర్ వయస్సు 64 ఏళ్లు మాత్రమేనని.. సమకాలీన రాజకీయాల్ని చూస్తే ఆయనది చాలా చిన్న వయసని.. మరో పదిహేనేళ్లు.. 20 ఏళ్లు రాజకీయాల్లో ఉండి ప్రభుత్వాన్ని.. పార్టీని నడిపిస్తారని చెప్పారు. అ సమయానికి తాను కానీ.. హరీశ్ కానీ రిటైర్ కావొచ్చని చెప్పారు కేటీఆర్. ప్రస్తుతానికి తమకు బాస్ కేసీఆరేనని.. ఆయన నాయకత్వంలో అందరం కలిసి స్వతంత్రంగా పని చేస్తామని చెప్పుకొచ్చారు.అధికారం కోసం.. తమ మధ్య పోటీ లేదన్న కేటీఆర్.. హరీశ్ రావుతో ఆరోగ్యకరమైన పోటీనే ఉందని స్పష్టం చేశారు.
తమ కుటుంబంలో విభేదాలు లేనే లేవని.. అందరం కలిసి కట్టుగా పని చేస్తామన్న కేటీఆర్.. మంత్రి కమ్ బావ వరసైన హరీశ్ తో ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. మంత్రివర్గంలో మహిళ ఒక్కరు కూడా లేకపోవటం లోటుగా ఒప్పుకున్న ఆయన.. ఆ లోటును ముఖ్యమంత్రి పూడుస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేయటం గమనార్హం.
ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై విపక్షాలు చేసే ఆరోపణల్ని గట్టిగా తిప్పి కొట్టారు కేటీఆర్. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ప్రధానమైన రైతుల రుణమాఫీ విషయంపై స్పందిస్తూ.. ఏ ప్రభుత్వం వద్ద రూ.17,500 కోట్లు ఉండవని.. అంత పెద్ద మొత్తాన్ని ఒక్క దఫాగా ఏ ప్రభుత్వం తీర్చలేదని చెప్పిన ఆయన.. ఇప్పటికే మూడు విడతల్లో తాము రైతు రుణమాఫీని అమలు చేసినట్లు వెల్లడించారు. మరో రూ.5,500 కోట్లను నాలుగో విడతలో మాఫీ చేయనున్నట్లు చెప్పారు. ప్రతి నెలా తెలంగాణ రాష్ట్ర ఆదాయం రూ.8వేల కోట్లు అని.. అలాంటప్పుడు రూ.17,500 కోట్లు ఒకేసారి చెక్కు రాసి ఇవ్వలేమన్న ఆయన.. తామే కాదు.. ఏ ప్రభుత్వం కూడా అలాంటి పని చేయలేరని చెప్పుకొచ్చారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలకమైన హామీని వందశాతం నిలబెట్టుకున్నామని.. త్వరలోనే నాలుగో విడత రుణమాఫీని విడుదల చేయటం జరుగుతుందని చెప్పారు. ఎన్నికల ప్రచార సమయంలో రైతు రుణ మాఫీ విషయంలో తాము రూ.లక్ష ఇస్తామని చెబితే.. కాంగ్రెస్ వారు రాహుల్ గాంధీని పిలిపించి రూ.2లక్షలు ఇస్తామని చెప్పించారని.. అయినా ప్రజలు వారిని నమ్మలేదన్నారు.
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వ్యవధిలోనే తెలంగాణ విద్యుత్ సంక్షోభాన్ని తమ ప్రభుత్వం అధిగమించినట్లు చెప్పిన కేటీఆర్.. పెద్ద నోట్ల రద్దు ఉద్దేశాలు మంచివే అయినా.. ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని చెప్పారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం చాలా వేగంగా ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం గురించి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘జేఏసీని ఏర్పాటు చేసింది.. జేఏసీకి ఛైర్మన్ గా కోదండరాంను నియమించింది కూడా కేసీఆరే. కానీ.. ఏ కారణం వల్లనో ప్రభుత్వానికి ఆయనకు విభేదాలు వచ్చాయి. అవి పెరుగుతున్నాయి. ఎక్కడ టెంట్ వేసినా వెళ్లి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం ఆయనకు కూడా మంచిది కాదు’’ అని వ్యాఖ్యానించటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/