Begin typing your search above and press return to search.
ఇవాంకా రాక..కేటీఆర్ 23వేల కోట్ల లెక్క
By: Tupaki Desk | 3 Jan 2018 8:01 AM GMTఇవాంకా ట్రంప్...హైదరాబాదీలకు సుపరిచితమైన పేరు. రెండు నెలల ముందు వరకు కొందరికే తెలిసిన ఈ పేరు ఇటీవలి కాలంలో అందరి నోటా నానింది. ఇందుకు కారణం హైదరాబాద్ వేదికగా సాగిన గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ ఒకటే కాదు...ఈ సదస్సు పేరుతో ఇవాంకా రాక సందర్భంగా నగరంలో జరిగిన హడావుడి. ఆఘమేఘాల మీద చేసిన అభివృద్ధి పనులు. రోడ్లు బాగు చేయడం నుంచి మొదలుకొని..జబిచ్చగాళ్లను తరిమివేయడం - వీధికుక్కలు పట్టడం వరకు....ఎన్నెన్నోవార్తలు ఇవాంకా పర్యటన సందర్భంగా తెరమీదకు వచ్చాయి. అయితే తాజాగా మరోమారు ఇవాంకా టూర్ పై మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు.
వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం(ఎస్ ఆర్ డీపీ) తొలి దశ పనుల్లో భాగంగా అయ్యప్ప సొసైటీ చౌరస్తా వద్ద 450 మీటర్ల పొడవైన అండర్ పాస్ ను మంత్రులు నాయిని నర్సింహారెడ్డి - కేటీఆర్ - పట్నం మహేందర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో రూ. 23 వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కేటీఆర్ తెలిపారు. ఎస్ ఆర్ డీపీ కింద రూ. 3,200 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. మరో రూ. 3 వేల కోట్ల అభివృద్ధి పనులకు టెండర్లు పిలవబోతున్నామని ప్రకటించారు. హైదరాబాద్ ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఉద్ఘాటించారు.ఈ అండర్ పాస్ ను పూర్తి చేయడానికి 12 నెలల సమయం ఉన్నప్పటికీ 9 నెలల్లోపే పూర్తి చేయడం జరిగిందన్నారు. ఎస్ ఆర్ డీపీని నాలుగు దశల్లో అమలు చేస్తున్నామని చెప్పారు. 110 కిలోమీటర్ల ఎలివేటర్ కారిడార్ నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నామన్నారు.
హైదరాబాద్ లో జరిగే పనులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయ ఇవాంకా ట్రంప్‌కు ముడిపెట్టి గతంలో కొందరు మాట్లాడారని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం ఎన్నో రకాల పనులు జరుగుఉతన్నాయని..ఇవాన్నీ ఇవాంకా ట్రంప్ కోసం కాదనే విషయాన్ని గుర్తించాలన్నారు. హైదరాబాద్ ప్రజల కోసమే తాము ఈ పనులు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎస్ ఆర్ డీపీ కింద రూ. 3,200 కోట్ల పనులు జరుగుతున్నాయని తెలిపారు. మైండ్ స్పేస్ వద్ద నిర్మాణంలో ఉన్న అండర్ పాస్ మార్చి వరకు పూర్తవుతుందన్నారు. మైండ్ స్పేస్ జంక్షన్ లో వచ్చే ఏడాది జూన్ నాటికి ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. జూన్ నాటికి కామినేని జంక్షన్ ఫ్లై ఓవర్ - మార్చి లేక ఏప్రిల్ నాటికి చింతలకుంట అండర్ పాస్ నిర్మాణం పూర్తి చేస్తామని కేటీఆర్ చెప్పారు. అంబర్ పేట ఫ్లై ఓవర్ 2019 - సెప్టెంబర్ వరకు పూర్తవుతుందన్నారు. వీఎస్టీ నుంచి ఇందిరాపార్క్ వరకు ఫ్లై ఓవర్ నిర్మాణం పరిశీలనలో ఉందన్నారు.
జవాబుదారీతనంతో - ప్రణాళికబద్దంగా పనులు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ సంవత్సరం పనులన్నింటిని ప్రణాళికబద్దంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ లోని రోడ్లను యుద్ధప్రతిపాదికన మరమ్మతులు చేస్తున్నామని స్పష్టం చేశారు. వర్షం వచ్చిన రోడ్లు దెబ్బతినకుండా ఉండేందుకు కొత్త టెక్నాలజీతో 950 కోట్ల రూపాయాలతో రోడ్ల నిర్మాణం జరుగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.