Begin typing your search above and press return to search.
బీజేపీ సీఎంను ఫిదా చేసేసిన కేసీఆర్
By: Tupaki Desk | 14 Nov 2017 6:30 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో ముఖ్యమంత్రికి ఎందుకు అప్పిచ్చాడు? అందులోనూ బీజేపీ సీఎం కేసీఆర్‌ను ఏం అప్పు అడిగారు...ఎందుకు అడిగారు అనేదే కదా మీ సందేహం. అక్కడికే వస్తున్నాం. పొరుగున ఉన్న మహారాష్ట్ర సీఎంకు కేసీఆర్ ఈ అప్పు ఇచ్చారు. అవి రైల్ బోగీలు. సాదాసీదా రైల్లు కాదు..మెట్రో రైల్లు. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో తెలుసా? ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడైన మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు.
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మెట్రో నిర్మాణం - ప్రారంభం - నిర్వహణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఐటీ - పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా వివరిస్తూ దేశ చరిత్రలో మొదటిసారిగా 30 కిలోమీటర్ల మేర మెట్రోను ప్రారంభిస్తున్నామని చెప్పారు. నగరంలో మెట్రో రైలు నిర్వహణ కోసం రూ. 3 వేల కోట్లు కేటాయించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటి వరకు రూ. 2,240 కోట్లు ఖర్చు చేశామన్నారు. కేంద్రం రూ. 1,458 కోట్లు సమకూరుస్తుందన్న మంత్రి...రూ. 958 కోట్లు విడుదల చేసిందని కేటీఆర్ చెప్పారు. నవంబర్ 28న మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ప్రధాని కార్యాలయం నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉందన్నారు. ఇప్పటికే మెట్రో ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం మోదీని ఆహ్వానించిందని, ఈ విషయంలో త్వరలో అధికారిక సమాచారం రానుందని మంత్రి వివరించారు.
మన దేశానికి చెందిన ఎల్ ఆండ్ టీ ఈ ప్రాజెక్టును పూర్తిచేసినందునే ప్రధానమంత్రితోనే మెట్రో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మెట్రోను పూర్తి స్థాయిలో నడిపించేందుకు 57 రైళ్లు అవసరమని...అన్ని రైళ్లు కూడా వచ్చాయన్నారు. అన్ని రకాలుగా, అన్ని హంగులతో ప్రారంభానికి మెట్రో సిద్ధమైందన్నారు. మన మెట్రో విషయంలో పొరుగు రాష్ర్టానికి సైతం సహాయం చేశామన్నారు. నాగపూర్ మెట్రోను ప్రారంభించేందుకు సిద్ధమైనప్పటికీ అక్కడ రైళ్లు అందుబాటులో లేకపోవడంతో మహారాష్ట్ర సీఎం మన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ చేయడంతో తాము పంపించామని తెలిపారు. ఈ విషయంలో మహారాష్ట్ర సీఎం ఈ విషయంలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారన్నారు.