Begin typing your search above and press return to search.
మోడీ చేసిందే..కేసీఆర్ చేస్తాడట
By: Tupaki Desk | 16 March 2018 4:21 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడమనే ప్రక్రియ వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందుకు తగినట్లుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ వైపు సన్నాహాలు చేస్తుంటే..మరోవైపు ఆయన కుటుంబ సభ్యులు సైతం దానికి బలం చేకూర్చేందుకు సన్నద్ధం అవుతున్నారు. తాజాగా కేసీఆర్ తనయుడు - రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇదే కామెంట్లు చేశారు. సీఎం కేసీఆర్ ఎజెండానే జాతీయ ఎజెండా కానున్నదని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సామాన్య ప్రజలకు ఏం కావాలో అదే సీఎం కేసీఆర్ ఎజెండాలో ఉంటుందన్నారు. తెలంగాణ అభివృద్ధి నమూనాతో ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారన్నారు.
మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా కేటీఆర్ ముచ్చటిస్తూ గత ఎన్నికల్లో గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్రమోడీ.. ఆ రాష్ట్ర మోడల్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిన విషయాన్ని గుర్తుచేశారు. తాము పది పార్టీలతో కూటమి కట్టే ప్రయత్నం చేయడంలేదన్నారు. ఉత్తరప్రదేశ్ - బీహార్ ఉపఎన్నికల ఫలితాలు కేసీఆర్ ఆలోచన ధోరణిని ప్రజలు సమర్థిస్తున్నట్టు ఉన్నాయని వ్యాఖ్యానించారు. యూపీలో బీజేపీ - కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలిందని - సమాజ్ వాదీ పార్టీ గెలుపుతో ప్రజలు ప్రాంతీయ పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారని స్పష్టమైందని కేటీఆర్ చెప్పారు. బీజేపీ - కాంగ్రెస్ కు కాలం చెల్లిందని - ఆ పార్టీలను ప్రజలు ఇక నమ్మేస్థితిలో లేరన్నారు. కొత్త ఫ్రంట్ ఏర్పాటుకావాలని దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారని కేటీఆర్ విశ్లేషించారు. ఈ ప్రాంత బిడ్డగా కేసీఆర్ తెలంగాణ సాధించి రుణం తీర్చుకున్నారని - పౌరుడిగా కొత్త ఫ్రంట్ ఏర్పాటుచేసి భారతమాత రుణం తీర్చుకుంటారన్నారు. ఇప్పటికే యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తున్నదని - కేసీఆర్ సరికొత్త రాజకీయాలకు స్పందిస్తున్నదని చెప్పారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తే ప్రజలు పట్టించుకొనే పరిస్థితి లేదని - కాంగ్రెస్ నాయకులది అధికార ఆరాటమేనన్న సంగతి ప్రజలకు తెలిసిపోయిందని కేటీఆర్ అన్నారు. మంత్రి హరీశ్ రావు ప్రజల ఆశయాలు - ఆకాంక్షల కోసమే నాడు శాసనసభలో నిరసన వ్యక్తం చేశారని చెప్పారు. హరీశ్ రావు ఆందోళనకు - కాంగ్రెస్ చేసిన అప్రజాస్వామిక తీరుకు పోలిక ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు.