Begin typing your search above and press return to search.
నాలుగు విప్లవాలతో దశమారుతోందన్న కేటీఆర్
By: Tupaki Desk | 18 May 2018 11:59 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గురించి ఆయన తనయడైన రాష్ట్ర మంత్రి కేటీఆర్ అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం విజయవంతం అయిందని పేర్కొన్నారు. నాలుగు విప్లవాలతో రాబోయే ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి రానుందని ధీమాగా చెప్పారు. దేశంలోనే రెండో హరిత విప్లవానికి తెలంగాణ ఆధ్యంగా మారుతుందన్నారు. పదేళ్లలో రైతుబంధుకు మించిన సంతృప్తి ఏ పథకం ఇవ్వలేదని చెప్పారు. సాగునీరు - రైతుబంధు వల్ల గల్ఫ్‌కు వలస వెళ్లిన వారు తిరిగి వస్తున్నారని చెప్పారు. ఉపాధి హామీ పథకం వ్యవసాయానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. పంటల బీమా విధానం మారాలి, కమతం యూనిట్ గా జరగాలని తెలిపారు.
రైతుబంధు పథకంపై విపక్షాల ఆరోపణలు సరికావని కేటీఆర్ అన్నారు. 98.3 శాతం రైతులు చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని తెలిపారు. 1.7 శాతం రైతులకు మాత్రమే 10 ఎకరాలకు పైగా భూమి ఉందన్నారు. 10 ఎకరాలకు పైగా ఉన్నవారికి పంట పెట్టుబడి ఇవ్వకపోయి ఉంటే విపక్షాలు రాద్ధాంతం చేసేవి అని పేర్కొన్నారు. పథకం సానుకూలంగా అమలు కావాలన్నది ప్రభుత్వ లక్ష్యమని కేటీఆర్ ఉద్ఘాటించారు. భూపరిమితి చట్టం ప్రకారం ఎవరికీ 54 ఎకరాలకు పైబడి ఉండరాదన్నారు. వందల ఎకరాలున్నాయని చిల్లర ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలపై మంత్రి మండిపడ్డారు. కౌలురైతులకు సాయం చేస్తే వారు భూమిపై హక్కులు కోరుతారని తెలిపారు. రైతుబంధు ప్రయోజనం కౌలురైతులకు కూడా పరోక్షంగా అందుతుందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పై మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు చేస్తుందన్నారు. త్వరలోనే ముసాయిదాను మంత్రివర్గానికి తీసుకెళ్తామని మంత్రి చెప్పారు. నవంబర్ లో మరింత సాధికారికంగా రైతుబంధు సాయం అందుతుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
పల్లెసీమల్లో మార్పు తీసుకువచ్చేందుకు విప్లవాత్మక పథకాలు ప్రవేశపెట్టినట్లు కేటీఆర్ తెలిపారు. హరిత విప్లవం-నీలి విప్లవం- గులాబీ విప్లవం (మాంసం శుద్ధి పరిశ్రమ-క్షీర విప్లవంతో క్షేత్రస్థాయిరైతుల జీవితాల్లో మార్పు వస్తోందని వివరించారు. రాబోయే ఎన్నికల్లో వందకు వంద శాతం కేసీఆరే మళ్లీ సీఎం అవుతారని కేటీఆర్ స్పష్టం చేశారు. 2019 ఎన్నికలు ఏకపక్షంగా సాగనున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రజలు కేసీఆర్ ను ఏకోన్ముఖంగా కోరుకుంటున్నారని తెలిపారు. టీఆర్ ఎస్ అధికారంలోకి రాకపోతే రాజకీయాల్లో ఉండను అని చెప్పారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగానే అధికారంలోకి వస్తామని, కేసీఆర్ రే సీఎం పీఠం చేపడతారని వెల్లడించారు.