Begin typing your search above and press return to search.
బండి సంజయ్‌ను రౌండప్ చేస్తున్న కేటీఆర్
By: Tupaki Desk | 17 March 2022 11:30 PM GMTతెలంగాణలో గత కొద్దికాలంగా రాకజీయ విమర్శలు - ప్రతివిమర్శలు జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. నేతలు తమదైన శైలిలో ప్రత్యర్థులను ఇరుకున పెడుతున్నారు. ఎదుటివారి బలాలను దృష్టిలో పెట్టుకొని బలహీనతలపై టార్గెట్ చేస్తున్నారు. ఇలా తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను అధికార టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసింది.
తాజాగా కరీంనగర్ జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లాలో రూ. 1,067 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
కరీంనగర్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై నిప్పులు చెరిగారు. కరీంనగర్ పట్టణానికి అర పైసా పని కూడా చేయని బండి సంజయ్‌పై కేటీఆర్ ధ్వజమెత్తారు. దమ్ముంటే మంత్రి గంగుల కమలాకర్‌పై పోటీ చేసి గెలువాలని కేటీఆర్ సవాల్ విసిరారు.
`కరీంనగర్ జిల్లాకు మెడికల్ కాలేజీ కేటాయించాం. వచ్చే సంవత్సరం బ్రహ్మాండంగా ప్రారంభం కాబోతున్నది అని కేటీఆర్ తెలిపారు. రూ. 1067 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాం. కరీంనగర్‌కు ఒకప్పుడు తాగునీటికి ఇబ్బంది ఉండేది.
ఇంటింటికీ నల్లా పెట్టి నీళ్లు ఇస్తున్నాం. 50 వేల కనెక్షన్లకు 24 గంటల పాటు నీళ్లు ఇస్తాం. కరీంనగర్ ఎల్ఎండీ వద్ద అద్భుతమైన తీగల వంతెనను నిర్మించారు. రూ. 410 కోట్లతో సదాశివపల్లి దాకా మానేరు రివర్ ఫ్రంట్ పనులకు శంకుస్థాపన చేశాం` అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన వ్యక్తి.. ఒక్క పని కూడా చేయలేదని బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ``కరీంనగర్ కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం వెయ్యి పనులు చేసింది. వినోద్ కుమార్ ఎంపీగా ఉన్న సమయంలో స్మార్ట్ సిటీ స్టేటస్ కరీంనగర్‌కు వచ్చింది. బండి సంజయ్ గెలిచి మూడేళ్లు అయింది.
కనీసం కరీంనగర్ పట్టణం కోసం రూ. 3 కోట్ల పని కూడా చేయలేదు. దమ్ముంటే ఏం చేశారో చెప్పాలి. కరీంనగర్‌కే కాదు.. సిరిసిల్ల నేతన్నలకు పవర్ లూమ్ కస్టర్ ఇవ్వకుండా మొండి చేయి చూపుతున్నారు. చొప్పదండికి కూడా ఏం చేయలేదు. కాళేశ్వరం ద్వారా పూర్వ కరీంనగర్ జిల్లాను సస్యశ్యామలం చేశాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు కనీసం జాతీయ హోదా ఇప్పియ్యలేదు.
ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కనీసం పార్లమెంట్‌లో కూడా మాట్లాడలేదు` అని కేటీఆర్ మండిపడ్డారు. ``బండి బాగా మాట్లాడుతున్నావ్.. దమ్ముంటే గంగుల మీద పోటీ చేసి గెలువాలని సవాల్ విసురుతున్నా. కమలాకర్‌ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నా` అని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా, తన ఇలాకాలో తనపై ఈ రేంజ్‌లో కామెంట్లు చేసి, అభివృద్ధి పనులతో టార్గెట్ చేసిన అధికారి పార్టీపై బండి సంజయ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.