Begin typing your search above and press return to search.
సెటిలర్లకే పెద్దోడు కేటీఆరా?
By: Tupaki Desk | 13 Jan 2016 11:30 AM GMTషాకింగ్ మాటలు తెలంగాణ మంత్రి కేటీఆర్ నోటి వెంట వచ్చాయి. సెటిలర్.. నాన్ సెటిలర్ అన్న మాటలు తరచూ వినిపించే వైనానికి చెక్ చెప్పాలనుకున్నారో ఏమో కానీ.. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో తానూ సెటిలరేనన్న విషయాన్ని తేల్చారు. సెటిలర్ల పదమే లేదని అప్పట్లో ఇదే కేటీఆర్ తండ్రి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానిస్తే.. అసలు హైదరాబాద్ లో ఉన్నోళ్లంతా సెటిలర్లేనని.. స్థానికులు ఎవరూ తేల్చేసి కొత్త చర్చకు తెర తీశారు. గ్రేటర్ ఎన్నికల్లో ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడిన వారి ఓట్లు పెద్ద ఎత్తు ఉండటం.. గ్రేటర్ అధిక్యంలో వారి పాత్ర కీలకం కానున్న నేపథ్యంలో.. వారి మనసును దోచుకునేందుకు కేటీఆర్ తాజా వ్యాఖ్యలు చేసినట్లుగా చెప్పొచ్చు.
ఆంధ్రా ప్రాంత మూలాలు ఉన్నోళ్ల కాలికి ముల్లు గుచ్చుకుంటే తన నోటితో తీస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ వ్యాఖ్యానిస్తే.. అంతకు ఒక మెట్టు పైకెక్కి.. అసలు తాను స్థానికుడిని కాదని.. సెటిలర్ నని కేసీఆర్ చెప్పుకోవటమే కాదు.. అందుకు పెద్ద ఉదాహరణలే చూపించటం విశేషం. అమెరికాలాంటి అగ్రదేశమే ఒక వలసల దేశమని.. హైదరాబాద్ కూడా అంతేనని తేల్చేశారు. హైదరాబాద్ లో స్థానికులు ఎవరూ లేరని చెప్పేశారు.
రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రం విడిపోతే హైదరాబాద్ లో ఆంధ్రా వారిని తరిమేస్తారని.. వారి ఆస్తులు దోచుకుంటారని.. సెటిలర్లను బతకనివ్వరంటూ కొందరు విష ప్రచారం చేశారని.. కానీ.. గడిచిన 18 నెలల్లో ఏం జరిగిందంటూ ప్రశ్నించారు. మొత్తానికి తన తాజా వ్యాఖ్యలతో సెటిలర్ల మనసుల్ని దోచుకోవాలని ప్రయత్నిస్తున్న కేటీఆర్ మాటలు ఎంతవరకు వర్క్ వుట్ అవుతాయో చూడాలి. మరి.. తానే పెద్ద సెటిలర్ అన్నట్లు మాట్లాడిన కేటీఆర్.. తెలంగాణ ఉద్యమ సమయంలో సెటిలర్ల మీద చేసిన వ్యాఖ్యల మాటేమిటంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. మరి.. ఆ విషయంపైనా కేటీఆర్ కాస్తంత స్పష్టత ఇస్తే బాగుంటుందేమో.