Begin typing your search above and press return to search.
రూ.3వేల కోట్లు తీసుకొచ్చాడంట
By: Tupaki Desk | 26 May 2015 5:46 AM GMTదాదాపు మూడు వారాల పాటు సాగిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన సోమవారం ముగిసింది. మంగళవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న కేటీఆర్.. విమానాశ్రయం నుంచి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడారు.
మే 5నఅమెరికాకు వెళ్లిన ఆయన.. అమెరికాలోని పలు నగరాల్లో విసృతంగా పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పలు సంస్థల అత్యున్నత ప్రతినిధులతో భేటీ కావటం.. పలు ఒప్పందాలు కుదుర్చుకోవటం తెలిసిందే.
తన పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి రూ.3వేల కోట్ల పెట్టుబడుల్ని తీసుకొచ్చానని కేటీఆర్ వెల్లడించాడు. హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా తాను జరిపిన విదేశీ పర్యటన తొలి అడుగుగా అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానాన్ని తెలుసుకున్న పలు అమెరికా సంస్థల ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేశారని చెప్పారు. పెట్టుబడులు పెట్టేందుకు వారు ఆసక్తి చూపుతున్నారన్నారు. మొత్తానికి కేటీఆర్ మూడు వారాల అమెరికా పర్యటనలో రూ.3వేల కోట్లు పెట్టుబడులు తీసుకురావటం కాస్తంత విశేషమే.