Begin typing your search above and press return to search.
రేవంత్ కు ఆ పేరు ఖరారు చేసిన కేటీఆర్
By: Tupaki Desk | 18 Jan 2017 4:28 AM GMTతెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీపీ సభ్యుడు రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నపుడు రేవంత్ రెడ్డి మధ్యలో అడ్డు తగలడంతో కేటీఆర్ స్పందిస్తూ... 'అధ్యక్షా చిలక మనదే గానీ.. పలుకులు మాత్రం పరాయిది' అని ఎద్దేవా చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చినపుడు బ్రిటీష్ వారు కొన్ని అవశేషాలను వదిలి వెళ్లినట్లు తెలంగాణ వచ్చిన తరువాత ఆంధ్రాపార్టీ వదిలివెళ్లిన అవశేషమే రేవంత్ రెడ్డి అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. వాళ్ల నాయకుడు తెలంగాణ వదిలి వెళ్లిపోయినా వీళ్లు మాత్రం ఇంకా ఆయనపై ఇక్కడ ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు.
ఇదిలాఉండగా రాజధాని అభివృద్ధి ప్రణాళికలపై అసెంబ్లీలో జరిగిన లఘు చర్చలో వివిధ అంశాలను మంత్రి కేటీఆర్ వివరించారు. విశ్వ నగరావిష్కరణ ఒక్కరోజులో సాధ్యమయ్యేది కాదు. సమష్టి ప్రయత్నంతోనే సాధ్యం. హైదరాబాద్ అభివృద్ధికి అవసరమైన బృహత్తర ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నాం’ అని కేటీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. 50 వేల కుటుంబాలున్న 200 మురికివాడలకు ఫిబ్రవరి నుంచి రోజూ మంచినీరు విడుదల చేయనున్నట్టు తెలిపారు. మార్చినాటికి సాధ్యమైనన్ని ఎక్కువ ప్రాంతాలకు రోజూ మంచినీటి సరఫరా విస్తరించనున్నట్టు వివరించారు. అలాగే, 19 వందల కోట్ల వ్యయంతో 13 శివారు మున్సిపాల్టీల్లో మంచినీటి సరఫరాకు ఏర్పాట్లు చేశామన్నారు. మూడు ప్యాకేజీలుగా ప్రాజెక్టు పనులు చేపట్టామని కేటీఆర్ అన్నారు. 2600 కిలోమీటర్ల పైపులైన్ నెట్‌వర్క్ వేయాల్సి ఉందని, ఇప్పటి వరకు 550 కిలోమీటర్ల పైపులైన్ పూర్తి చేశామన్నారు. ఒప్పందం ప్రకారం 2018 ఫిబ్రవరి నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. 50 ఏళ్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని శామీర్ పేట - దేవలమ్మ నగరం వద్ద రెండు నీటి నిల్వ రిజర్వాయర్లు నిర్మిస్తున్నట్టు చెప్పారు. 7770 కోట్ల అంచనా వ్యయంతో కేశవపురం రిజర్వాయర్ కోసం మెస్సర్ వాప్కోస్ కన్సల్టెంట్స్‌కు డిపిఆర్ సమర్పించామన్నారు. హుస్సేన్ సాగర్ కు చేరుతున్న కూకట్ పల్లి నాలా మురుగును 40 కోట్ల వ్యయంతో మళ్లించినట్టు కేటీఆర్ వివరించారు.
మహానగర రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని కేటీఆర్ తెలిపారు. వాహన రద్దీ, కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్కైవేలు, రోడ్ కారిడార్లు, గ్రేడ్ సెపరేటర్ల అంశాలతో వ్యూహాత్మక రవాణా మార్గాల అభివృద్ధి ప్రణాళిక రూపొందించామన్నారు. 19వేల 263 కోట్ల వ్యయంతో నాలుగు దశల్లో పనులు చేపట్టామన్నారు. సైబరాబాద్ ఐటి కారిడార్‌లో 115.46 కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. నీటి ముంపునకు శాశ్వత పరిష్కారంగా 45 ప్రాంతాలను గుర్తించి వైట్ టాపింగ్, పేపర్ బ్లాక్ లను వేయనున్నట్టు కేటీఆర్ వివరించారు. మూసీ శుద్ధి, సుందరీకరణ నిర్మాణాల కోసం ప్రత్యేకంగా రివర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నామని కేటీఆర్ అన్నారు. మూసీ పరివాహకంలో 10 స్థలాలు ఎంపిక చేసి, 610 ఎంఎల్ డిల ఎస్టీపీలు నిర్మించనున్నట్టు చెప్పారు. ప్రాజెక్టు వ్యయం 12 వందల కోట్లుగా వివరించారు. శివారు సర్కిళ్లలో 3067 కోట్ల వ్యయంతో డ్రెయినేజీ సదుపాయం ఏర్పాటు చేస్తున్నట్టు కేటీఆర్ చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/