Begin typing your search above and press return to search.

మెట్రో షో మొత్తాన్ని న‌డిపిస్తోన్న కేటీఆర్

By:  Tupaki Desk   |   26 Nov 2017 4:24 AM GMT
మెట్రో షో మొత్తాన్ని న‌డిపిస్తోన్న కేటీఆర్
X
అంతా క‌లిసి ఉన్నాం.. మా మ‌ధ్య‌న ఏమీ లేదు.. ఏదైనా ఉందంటే అదంతా మీడియా సృష్టేన‌ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కుమారుడు క‌మ్ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చెప్ప‌టం క‌నిపిస్తుంది. మీడియా ప్ర‌తినిధులు అడిగే ప్ర‌శ్న‌ల‌కు ఎట‌కారపు స‌మాధానాలు చెప్పే తీరు కేటీఆర్ లో స్ప‌ష్టంగా క‌నిపిస్తుంటుంది. ఇందుకు త‌గ్గ‌ట్లే మెట్రో రైల్ రైడ్ పేరిట శ‌నివారం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఈ తీరు స్ప‌ష్టంగా క‌నిపించింది.

మెట్రో ఛార్జీల ప్ర‌క‌ట‌న ఎందుకు ఆల‌స్యం చేస్తున్నారు? అన్న మీడియా ప్ర‌తినిధి ప్ర‌శ్న‌కు సూటిగా స‌మాధానం చెప్ప‌ని కేటీఆర్‌.. నీకు ఉత్సుక‌త ఉందేమో.. ప్ర‌జ‌ల‌కు లేదని తేల్చేశారు. మేం ప్ర‌క‌టిస్తాం క‌దా అంటూ స‌మాధానం ఇవ్వ‌టం.. దీనిపై మ‌ళ్లీ ప్ర‌శ్న వేసేందుకు ప్ర‌య‌త్నిస్తే.. ఓ చ‌క్క‌టి వేడ‌క వేళ‌లో మ‌ళ్లీ అదే ప్ర‌శ్న‌లా? అంటూ అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేయ‌టం క‌నిపించింది. మీడియా ప్ర‌తినిధులు అడిగిన ఏ ప్ర‌శ్న‌కు మంత్రి కేటీఆర్ సూటిగా స‌మాధానం చెప్ప‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.

మెట్రో రైల్ రైడ్ ను తెలంగాణ రాష్ట్ర మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీల‌తో నిర్వ‌హిస్తున్న మీడియాకు సందేశాన్ని పంపిన‌ప్ప‌టికీ.. హాజ‌రైంది మాత్రం కేటీఆర్ అండ్ కో మాత్ర‌మే. రాష్ట్ర స‌ర్కారులో కీల‌క‌మైన మంత్రి హ‌రీశ్ కానీ ఈటెల రాజేంద‌ర్ తో స‌హా ఉప ముఖ్య‌మంత్రులిద్ద‌రూ రాని వైనం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించింది.

మెట్రో షో మొత్తాన్ని త‌న‌ద‌న్న‌ట్లుగా మంత్రి కేటీఆర్ అనుకోవ‌టం.. అందుకు త‌గ్గ‌ట్లే వ్య‌వ‌హ‌రించిన‌ట్లు చెబుతున్నారు. త‌న‌కు అంత‌గా పొస‌గ‌ని నేత‌ల్ని ప‌క్క‌న పెట్టేసి కేటీఆర్‌.. త‌న‌కు ఇష్టం లేని వారికి సైతం తెలివిగా ప‌క్క‌న పెట్టిన‌ట్లుగా చెబుతున్నారు. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రానికి త‌ల‌మానికం లాంటి మెట్రో ప్రాజెక్టును.. మెట్రోరైల్ రైడ్ ను తెలంగాణ ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు చూపిస్తున్న‌ట్లు చెప్పిన కార్య‌క్ర‌మానికి తెలంగాణ ప్ర‌భుత్వంలో కీల‌క భూమిక పోషించే వారెవ‌రూ క‌నిపించ‌క‌పోవ‌టం ఎందుకు? అన్న ప్ర‌శ్న‌కు కేటీఆరే అన్న స‌మాధానం బ‌లంగా వినిపిస్తోంది.

మెట్రో షో మొత్తం త‌న‌దిగానే ఉండాల‌న్న కేటీఆర్ త‌ప‌న‌కు త‌గ్గ‌ట్లే పిలుపుల కార్య‌క్ర‌మం ఉన్న‌ట్లు చెబుతున్నారు. మంత్రులు ఈటెల‌.. హ‌రీశ్ లాంటి వారికి స‌మాచారం పంపిన‌ప్ప‌టికీ.. ఆల‌స్యంగా పంపార‌ని.. వారు రాకూడ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించార‌న్న ఆరోప‌ణ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. దీంతో.. మ‌న‌స్తాపంతో మెట్రో రైలు రైడ్ కార్య‌క్ర‌మానికి ముఖ్య‌నేత‌లంతా దూరంగా ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా మెట్రో రైల్ రైడ్ పేరిట మంత్రి కేటీఆర్ ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మం అధికార‌ప‌క్షంలో కొత్త లొల్లికి కార‌ణ‌మైంద‌న్న అభిప్రాయం బ‌లంగా వినిపిస్తోంది.