Begin typing your search above and press return to search.
మెట్రో జర్నీలో కేటీఆర్..ఢిల్లీలాగా కావద్దని సూచన
By: Tupaki Desk | 25 Nov 2017 9:39 AM GMTఈనెల 28 తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా...హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. నగర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మెట్రో కల ఆ రోజున నెరవేరనుంది. అయితే మెట్రో ప్రారంభం కంటే ముందే...మంత్రి కేటీఆర్ అందులో జర్నీ చేశారు. ఎందుకు అనుకుంటున్నారా? ప‌్రజాప్రతినిధులకు మెట్రో జర్నీగురించి అవగాహన కలిగించేందుకు. నాగోలు నుంచి మెట్టుగూడ వరకు...తిరిగి మెట్టుగూడ నుంచి నాగోలు వరకు ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి కేటీఆర్ జర్నీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈనెల 28న ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మెట్రో ప్రారంభం అవుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. .. 29 నుంచే సాధారణ ప్రజలకు మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. దేశ చరిత్రలోనే ఇంత భారీ స్థాయిలో.. నాగోలు నుంచి మియాపూర్ మధ్య 30 కిలోమీటర్ల దూరంతో మెట్రోను ప్రారంభించుకోవడం ఇదే ప్రథమం అని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద మెట్రోగా మన ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు కేటీఆర్. 28న మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ మెట్రోను లాంఛనంగా ప్రారంభిస్తారని వెల్లడించారు. 29న ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మెట్రో రైళ్లు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇలా నాలుగు నెలల పాటు మెట్రో నడుస్తుందన్నారు. ఆ తర్వాత ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నడిపేలా చర్యలు తీసుకుంటామన్నారు.
మెట్రో ప్రయాణానికి వినియోగించే టీ సవారీ స్మార్ట్ కార్డును మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం నా మెట్రో స్వచ్ఛ మెట్రో పోస్టర్‌ను విడుదల చేశారు. టీ సవారీ స్మార్ట్ కార్డు త్వరలోనే అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ స్మార్ట్ కార్డులు మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్టుకు ఉపయోగపడేలా తయారు చేస్తున్నామని చెప్పారు. బస్సులు, ఆటోలు, క్యాబ్‌ల్లోనూ వినియోగించేలా టీ సవారీ కార్డును అందుబాటులోకి తెస్తామన్నారు. ఇక టీ సవారీ పేరిట మొబైల్ యాప్‌ను తయారు చేశామన్న మంత్రి.. ప్రధాని మోడీ చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరింపజేస్తామని వివరించారు.
ఢిల్లీలో రోజు రోజుకు కాలుష్యం అధికమవుతుందన్న కేటీఆర్.. అటువంటి పరిస్థితి హైదరాబాద్‌కు రావొద్దన్నారు. ఢిల్లీలో కాలుష్యం వల్ల పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నగరంలో ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రజలకు సౌకర్యంగా, ఆమోదయోగ్యంగానే మెట్రో టికెట్ ధరలు ఉంటాయని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మెట్రో టికెట్ ధరను ఇవాళ సాయంత్రం వరకు లేదా రేపు ఎల్ అండ్ టీ ప్రకటిస్తుందని తెలిపారు. టికెట్ ధరపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
పీపీపీ(పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్) మోడ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు ఇదని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ ప్రజలు మెట్రోను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.. ఆ బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఎల్ అండ్ టీ, హెచ్‌ఎమ్మార్ అధికారులు, సిబ్బంది రాత్రింబవళ్లు కష్టపడి పని చేసినందునే అనుకున్న సమయానికి మెట్రో పూర్తి అయిందన్నారు.